India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చేబ్రోలు(M) కొత్తరెడ్డి పాలెంలో వీఆర్ఏ అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ మృతిచెందడంతో దహనం చేసేందుకు VRA పెదఏబు, మరో మహిళ VRA హేమలత, ఏసుదాసు అనే వ్యక్తి శ్మశాన వాటికకు వచ్చారు. దహనం అనంతరం వచ్చిన రూ.3,500 నగదు పంపకంలో వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళ VRA హేమలత ఏబు తలపై బండ రాయితో కొట్టగా మరణించాడు.
పల్నాడు జిల్లా నకరికల్లులో అన్నదమ్ములను సోదరి హతమార్చిన విషయం తెలిసిందే. కాగా ఈ డబుల్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. పోలీసుల వివరాల మేరకు.. ప్రియుడుతో కలిసి కృష్ణవేణి పథకం ప్రకారం వారిని చంపివేసింది. నిందితురాలు కృష్ణవేణితో పాటు ప్రియుడు దానయ్య, మరో నలుగురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 26న రామకృష్ణను ఇంట్లో చున్నీ బిగించి హత్య చేసి గొరంట్ల కాలువలో పడేశారు.
పాతగుంటూరు బాలాజీనగర్‌లో మద్యం మత్తులో స్నేహితులు దాడి చేయడంతో మరణించిన తెనాలి యువకుడు దీపక్ కేసును పాతగుంటూరు పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. మృతిచెందిన దీపక్ తన స్నేహితుడు కిరణ్ కుమార్‌కు తెలియకుండా ఫోన్ పే నుంచి రూ.53వేలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడన్నారు. డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో మద్యం తాగించి దాడి చేయడంతో దీపక్ మృతిచెందాడని సీఐ సోమయ్య తెలిపారు.
విద్యుచ్ఛక్తిని పొదుపుగా వాడి భావితరాల వారికి ఇంధన వనరులను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. గురువారం, కలెక్టరేట్లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 14 నుంచి 20వ తేది వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. విద్యుచ్ఛక్తి ఆదాలో ప్రజలందరూ భాగ్యస్వామ్యం కావాల్సి ఉందన్నారు.
పరీక్షా పే చర్చ-2025 కార్యక్రమంలో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అధిక సంఖ్యలో నమోదు చేయించాలని గుంటూరు DEO సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. డైట్ లెక్చరర్ కె.ప్రసాద్ (బోయపాలెం)ని జిల్లాకు నోడల్ అధికారిగా నియమించామని చెప్పారు. https://innovativeindia.mygov.inలోకి వెళ్లి పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపల్స్ నమోదు చేయించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 9703622022కు వాట్సాప్ చేయండి.
పల్నాడు జిల్లాలో వరి కోతలు,నూర్పిళ్ళు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం జిల్లాలో 35 వేల హెక్టార్లలో సాగు జరిగినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. లెక్కల్లోకి రానటువంటి నాలుగైదు వేల ఎకరాల వరి పంట బావులు కిందసాగవుతోంది. అయితే కొనుగోలు కేంద్రాలు సరిపడా లేవని రైతులు, రైతు సంఘాలు అంటున్నాయి. కాగా 100కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేశామని, పేర్ల నమోదుకు రైతులు ముందుకు రావాలని సివిల్ సప్లై అధికారులు కోరుతున్నారు.
అయితే రైతులు పంట <<14924701>>పొలంలోనే ధాన్యాన్ని<<>> వ్యాపారులకు అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. 76 కేజీల బస్తాకు తేమ, గోతాల కింద 3, 4 kgలు తీసేసి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో బస్తాకి రూ.1200లోపే దక్కుతోంది. డిమాండ్ ఉన్న HMT, అంకుర, సోనం, పూజిత వంటి రకాలను వ్యాపారులు కొంటున్నారు. మరో 10 రోజుల్లో BPT వంటి రకాలు పెద్ద మొత్తంలో రానుండటంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
YCP కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు, మరికొందరి పార్టీ శ్రేణులపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. YCP నేతలు ఈ నెల 16న అంబటి రాంబాబు, నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, మరికొందరి నేతలు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్నారు. పోలీస్ సిబ్బందిని బయటకు వెళ్లనీయకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా నిరసన చేపట్టారని హెడ్ కానిస్టేబుల్ చంగలరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పొన్నూరు మండలం మనవ గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 9వేల టన్నుల ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని చెప్పారు. తేమ శాతం 17% మించి ఉన్నా కొంటామన్నారు. పొన్నూరు ప్రాంతంలో అదనంగా 7రైస్ మిల్లుల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.