India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమరావతికి రైల్వే నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, కేశిరెడ్డిపల్లి గ్రామాల్లో 24.01 ఎకరాల భూమిని సేకరించబోతున్నట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. కాగా గుంటూరు, పల్నాడు కృష్ణ, ఖమ్మం జిల్లాల్లో భూమిని సేకరించనున్నారు.
పెదకాకానికి చెందిన ఓ వ్యక్తి తన అన్న కుమార్తెను గర్భవతిని చేశాడని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలికకు నెలసరి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి స్థానిక వైద్యుడికి చూపించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆ బాలిక మూడు నెలల గగర్భంతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.14 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లోపరచుకొని, గత నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తున్నట్లు తల్లికి తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడకు చెందిన ఓ మహిళ కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడంతో పాటు శారీరకంగా వాడుకున్నారని ఆరోపిస్తూ మంత్రిపై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనకు సహకరించి బాధితురాలను బెదిరించిన PAపై బెదిరింపుల కేసు నమోదైంది.
నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచి విహారయాత్ర శనివారం పున: ప్రారంభమవుతోందని అధికారులు తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ ప్రయాణానికి పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. సాగర్ నుంచి శ్రీశైలానికి వెళ్లి తిరిగి వచ్చేందుకు పెద్దలకు రూ.3వేలు, పిల్లలకు రూ.2,400గా నిర్ణయించారు. శ్రీశైలం వెళ్లేందుకు పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1,600గా టిక్కెట్ ధర నిర్ణయించారు.
గుంటూరు విద్యానగర్‌కు చెందిన పోతుగుంట్ల చందన అనే విద్యార్థిని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించింది. అమరావతి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ నుంచి గత నెల 11న 18 మంది విద్యార్థుల బృందం హిమాలయాలకు వెళ్లారు. ఎవరెస్ట్ శిఖర బేస్ క్యాంపులో భాగంగా చందన ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్డు నెలకొల్పింది. దేశంలో హిమాలయ శిఖరాన్ని అధిరోహించిన తొలి ప్రైవేట్ కళాశాల కావడం విశేషమని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు.
కార్తీక మాసం స్నానం ఆచరించే భక్తులు నదీ తీర ప్రాంతాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు సూచించారు. భక్తులు ఒంటరిగా వెళ్లకూడదని, దొంగల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తెల్లవారుజాము నుంచే పొగమంచులో శైవ ఆలయాలకు, నదీ తీర ప్రాంతాలు, అతి వేగంగా ప్రవహించే కాలువలు, వంకలు లోతుగా ఉన్న చెరువుల వద్ద చిన్నారులు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.
దేశభద్రత, సమాజ రక్షణ కోసం అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరిచిపోలేనివని పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సమాజ శ్రేయస్సుకై అహర్నిశలు పోరాడి అమరులైన పోలీసుల త్యాగనిరతికి క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మందు బాబులను తమ షాపులకు రప్పించుకునేందుకు నిర్వాహకులు కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో ఓ వైన్‌షాపు వద్ద ఓ ఆఫర్ ప్రకటించారు. రూ.1000 అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి శనివారం లాటరీ తీసి 10మంది సభ్యులకు రూ.200విలువ గల బాటిల్ బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
పిట్టలవానిపాలెం మండలంలోని అల్లూరు గ్రామం నత్తలవారిపాలెంలో పండుగ రోజు విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లూరు గ్రామానికి చెందిన వజ్రమ్మ, ఆమె కూతురు శిరీష నెల్లూరు జిల్లా కావలిలో గురువారం తెల్లవారు జామున రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో అల్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఫిలిం స్టడీస్ విభాగంలో ప్రవేశాలకు నవంబర్ 2 చివరి తేదీ అని కోర్స్ కో-ఆర్డినేటర్ మధుబాయి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ యువతకు ఫిలిం మేకింగ్ పూర్తి స్థాయిలో అకడమిక్ జ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో ప్రారంభించినట్లు చెప్పారు. ఆసక్తిగల వారు ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.