Guntur

News May 19, 2024

గుంటూరు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు

image

భారతీయ వాయుసేనలో అగ్ని వీర్ వాయు సైనికుల ఉద్యోగం కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, జిల్లా సైనిక సంక్షేమ అధికారిని గుణశీల శనివారం తెలిపారు. పదవ తరగతి తస్సమానమైన అర్హత కలిగి ఉండాలన్నారు. ఫ్లూట్, కీబోర్డ్, పీయానో ఏదైనా సంగీత ప్రావీణ్యత కలిగి ఉండాలన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఆసక్తిగల యువకులు మే 22 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News May 19, 2024

గుంటూరు: భార్య తల పగలకొట్టిన భర్తపై కేసు

image

భార్య తల పగలగొట్టిన భర్తపై శనివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. కొండా వెంకటప్పయ్యకాలనీకి చెందిన వడ్డీ కాసులు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను గొడవ పెట్టుకుని ఇనుప రాడ్డుతో తల పగలగొట్టాడని భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు

News May 19, 2024

వట్టిచెరుకూరులో 45.6 మి.మీ. వర్షపాతం

image

గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా వట్టిచెరుకూరు మండలంలో 45.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటు వర్ష పాతం 9.4 మిల్లీ మీటర్లుగా ఉంది. ప్రత్తిపాడు 12.4, చేబ్రోలు 11.8, కాకుమాను 11.6, గుంటూరు తూర్పు 9.2, మేడికొండూరు 9.2, పెద కాకాని 9.2, తాడికొండ 9.2, పెదనందిపాడు 8.4, తుళ్లూరు 7.4, ఫిరంగిపురం 6.6, పొన్నూరు 5.2, దుగ్గిరాల 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News May 19, 2024

గుంటూరు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

image

వినుకొండ మండలం ఏనుగుపాలెంకి చెందిన శ్రీనివాస రావు, దేవి(30)దంపతులు. దేవి రోజు వెళ్లినట్లే శుక్రవారం తమ గేదేలను మేపటానికి పొలానికి వెళ్లింది. ఈ క్రమంలో పొలానికి వెళ్లిన దేవి ఇంటికి రాలేదని భర్త శ్రీనివాసరావు అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం గ్రామ శివారులోని ఒక నీటికుంటలో ఆమె మృతదేహం లభ్యమైంది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అదించగా.. ఘటనపూ పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 19, 2024

గుంటూరు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు

image

భారతీయ వాయుసేనలో అగ్ని వీర్ వాయు సైనికుల ఉద్యోగం కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, జిల్లా సైనిక సంక్షేమ అధికారిని గుణశీల శనివారం తెలిపారు. పదవ తరగతి తస్సమానమైన అర్హత కలిగి ఉండాలన్నారు. ఫ్లూట్, కీబోర్డ్, పీయానో ఏదైనా సంగీత ప్రావీణ్యత కలిగి ఉండాలన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఆసక్తిగల యువకులు మే 22 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News May 19, 2024

గురజాల: అల్లర్లు, హింసాత్మక ఘటనలు చేసిన వారికోసం ముమ్మర తనిఖీలు

image

సబ్ డివిజన్ పరిధిలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గురజాల, మాచర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై మొత్తం 59 కేసులు నమోదు చేయగా ఇప్పటి వరకు 584 మంది గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం అధికారులు సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నారు.

News May 19, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో భార్యా భర్తకు పోస్టింగ్

image

ఆ భార్యాభర్తలు ఐపీయస్‌ అధికారులు.. వీరిద్దరిని కూడా అదే ఉమ్మడి జిల్లాలో ఎస్‌పీలుగా ప్రభుత్వం నియమించింది. వారే పల్నాడు, బాపట్ల జిల్లాల ఎస్‌పీలుగా భార్య భర్తలు మల్లిక గర్గ్‌, వకుల్‌ జిందాల్‌లు. భార్యా భర్తలు ఇద్దరూ అఖిల భారత సర్వీసుల అధికారులైతే వేర్వేరు ప్రాంతాల్లో కొలువు తప్పదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోనే ఇద్దరికి పోస్టింగ్ రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

News May 19, 2024

అల్లర్ల వీడియోలు ప్రసారం చేయొద్దు: తిరుమలరెడ్డి

image

ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి వీడియోలను ప్రసారం చేయరాదని చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి తిరుమలరెడ్డి శనివారం తెలిపారు. అల్లర్లకు సంబంధించిన వీడియోలను పలు టీవీ ఛానల్స్ పదే పదే ప్రసారం చేస్తున్నాయని అన్నారు. అలా చేయడం ద్వారా ప్రశాంతత నెలకొన్న గ్రామాల్లో మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. అల్లర్లకు సంబంధించిన వీడియోలు పదే పదే ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News May 18, 2024

‘విధి నిర్వహణలో భాగంగా కూతురి పెళ్లికి వెళ్ళలేదు’

image

పల్నాడు జిల్లా ఎస్పీగా నియమితులైన మలికా గర్గ్ తండ్రి సత్యేంద్ర గర్గ్ గతంలో అండమాన్ నికోబార్ దీవుల డీజీపీగా, తూర్పు ఉత్తర ప్రాంతానికి జాయింట్ సెక్రటరీగా పని చేశారు. అయితే ఆయన విధుల నిర్వహణలో భాగంగా కూతురు వివాహానికి కూడా హాజరు కాలేకపోయారు. అలాగే మలికా గర్గ్‌కు 2023లో స్కోచ్ అవార్డు లభించింది. ఎవరైనా విధుల్లో తప్పు చేస్తే ఆమె ఉపేక్షించరనే పేరు కూడా ఉంది.

News May 18, 2024

పల్నాడు జిల్లా ‘పీపుల్స్ కలెక్టర్‌’గా శివశంకర్‌’

image

కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ జిల్లా కలెక్టరేట్‌ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన ఘనత పల్నాడు మాజీ కలెక్టర్ లోతేటి శివ శంకర్‌కే దక్కుతుంది. కాగా జిల్లాలో బంగారు తల్లి ద్వారా ఆడపిల్లల్లో రక్త హానత నియంత్రన, గ్రమోదయం ద్వారా ప్రతీ శుక్రవారం గ్రామాల్లో సమస్యల పరిష్కారం. SC, STల అబ్యున్నతికి నవోదయం వంటి పలు అభివృద్ది కార్యక్రమాలతో ‘పీపుల్స్ కలెక్టర్‌’గా పేరు సంపాదించుకున్నారు.