Guntur

News May 18, 2024

పల్నాడు: ‘బాటిళ్లలో పెట్రోల్ అమ్మకం నిషేధం’

image

పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు పెట్రోల్‌ బంకుల్లో బాటిళ్లలో, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ నింపరాదని జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ శనివారం తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. మండల స్థాయి అధికారులు ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.

News May 18, 2024

సూర్యలంక సముద్ర తీరానికి పోటెత్తిన పర్యాటకులు

image

బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక సముద్రతీరానికి పర్యాటకులు శనివారం పోటెత్తారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తీరంలో పర్యాటకులు సందడి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లు, పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

News May 18, 2024

ఈపూరు వద్ద పిడుగుపాటు.. రైతు మృతి

image

ఈపూరు మండలం అరేపల్లి ముప్పాళ్లలో పిడుగుపాటుకు గురై కర్రి హనుమంతరావు (40) అనే రైతు మృతి చెందాడు. హనుమంతరావు శనివారం గేదెలను మేపేందుకు వెళ్ళినప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుండగా గ్రామ సమీపంలోని నరసింహస్వామి ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే పిడుగుపడి హనుమంతరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు.

News May 18, 2024

మాచర్లకు చేరుకున్న రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు

image

సార్వత్రిక ఎన్నికలు జరిగిన అనంతరం మాచర్ల పట్టణంలో శనివారం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు దిగారు. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల జరిగిన అల్లర్ల పై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను సస్పెండ్, అండ్ ట్రాన్స్ఫర్ చేసిన విషయం విదితమే. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ కూడా విధించారు.

News May 18, 2024

BREAKING: పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్

image

పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్ నియమితులయ్యారు. ఆమె గతంలో కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేశారు. తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీగా రెండున్నరేళ్లకు పైగా పని చేశారు. అనంతరం తిరుపతి ఎస్పీగా పని చేశారు. మలికా గార్గ్ పశ్చిమ బెంగాల్‌కి చెందిన పోలీస్ అధికారిని.

News May 18, 2024

BREAKING: పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్ లాట్కర్

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్ లాట్కర్ నియమితులయ్యారు. ఈయన 2011 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన వ్యక్తి. ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్‌ ఆగ్రోస్‌ సంస్థకు, అగ్రికల్చర్‌ కోఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉపాధ్యక్షుడిగా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా పనిచేస్తుండగా.. బదిలీపై పల్నాడుకు కలెక్టర్‌గా రానున్నారు.

News May 18, 2024

గుంటూరు: ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

image

జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 2024, ఆగస్టులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గుంటూరు ప్రభుత్వ ఐటీఐ సహాయ సంచాలకులు ప్రసాద్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు జూన్ 10 లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలనకు జూన్ పదో తేదీ ఉదయం 11.59 గంటల లోపు తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐలో అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు.

News May 18, 2024

నరసరావుపేట బయల్దేరిన సిట్ బృందం

image

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం ఘటనలకు గల కారణాలకు అన్వేషించడానికి సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సిట్ బృందం నరసరావుపేట బయల్దేరింది. రెండు రోజుల్లో సిట్ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. దాని ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది. సిట్ బృందం నరసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి ప్రాంతాల్లో పర్యటించనుంది.

News May 18, 2024

సూర్యలంక బీచ్‌లో వైసీపీ అభ్యర్థి నూరిఫాతిమా

image

మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన రాజకీయ నేతలు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నూరిఫాతిమా ఎన్నికల ప్రచారం తనదైన శైలిలో నిర్వహించారు. పోలింగ్ అయిపోగా, శనివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో సేదదీరారు.

News May 18, 2024

నేటి నుంచి కాచిగూడ రైలు పునరుద్ధరణ

image

గుంటూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలు(17251)ను ఈనెల 18 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు మండల రైల్వే అధికారి శుక్రవారం తెలిపారు. అదేవిధంగా కాచిగూడ నుంచి గుంటూరు వచ్చే రైలు (17252) ఈనెల 19వ తేదీ నుంచి నడుస్తుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఈ రెండు రైళ్లను ఈనెల 31 వరకు రద్దు చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.