India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మచిలీపట్నంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో 38 ఫిర్యాదులు స్వీకరించారు. SP విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో అడిషనల్ SP V.V నాయుడు ఫిర్యాదులను స్వీకరించి చట్టపరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గుడివాడకు చెందిన వనజ కుటుంబ వేధింపులు, అవనిగడ్డకు చెందిన కిషోర్ ఉద్యోగ మోసం, తోట్లవల్లూరుకు చెందిన వృద్ధుడు నరసయ్య ఆస్తి కోసం తన కుమారులు వేధింపులు, తదితర ఫిర్యాదులు అందాయన్నారు.

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచి కేసుల పరిష్కారంలో జాప్యం కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం రాత్రిపూట గస్తీని పెంచాలన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం డివిజన్లో పని చేస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా శానిటేషన్ కిట్లు అందజేశారు. పరిసరాలను శుభ్రం చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో ఘనమైనదన్నారు.

కృష్ణా జిల్లాలో ఈ-పంట నమోదు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

జర్నలిజం ముసుగులో సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి ఆటకట్టించేందుకు కృష్ణాజిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం వారిచే జారీ చేసిన మీడియా అక్రిడిటేషన్లు కలిగి ఉన్న జర్నలిస్టులకు QRతో కూడిన ప్రెస్ స్టిక్కర్లు ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఫేక్ ఐడీ కార్డులతో మోసాలకు పాల్పడే వారి ఆటకట్టించేందుకు QRతో కూడిన ప్రెస్ స్టిక్కర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

జిల్లాలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులతో సమావేశమై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో CM చర్చించిన అంశాలపై సమీక్షించారు. ప్రతి శాఖకు సంబంధించిన పనుల్లో పురోగతి సాధించాలన్నారు. అదేవిధంగా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై స్పందించి పరిష్కరించాలన్నారు.

మచిలీపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ డీకే బాలాజీ జీఎస్టీ 2.0 సంస్కరణలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పన్ను తగ్గింపులు, వ్యాపారులకు కలిగే లాభాలు ఇంటింటికి చేరేలా చూడాలని ఆదేశించారు. మచిలీపట్నంలో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణకు రూపకల్పన చేయాలని సూచించారు.

కేసీపీ షుగర్స్ 2025-26 క్రషింగ్ సీజన్‌కు చెరకు ధర ప్రకటించింది. టన్నుకు రూ.400 సబ్సిడీతో కలిపి, చెరకు ధరను రూ.3,690గా నిర్ణయించినట్లు యూనిట్ హెడ్ యలమంచిలి సీతారామదాస్ తెలిపారు. యాంత్రీకరణకు అనువుగా సాగుచేసే రైతులకు టన్నుకు అదనంగా రూ.100 ఇస్తామన్నారు. ఈ సీజన్లో నాటే చెరకు మొక్క తోటలకు ఎకరాకు రూ.10 వేలు సబ్సిడీ, రూ.20 వేలు వడ్డీ లేని రుణం అందిస్తామని ప్రకటించారు.

కృష్ణా జిల్లాలో ఈ-క్రాప్ నమోదు గడువు (సెప్టెంబరు 15) ముగిసినా, జిల్లాలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో నమోదు కాలేదు. ఆర్ఎస్కే ఉద్యోగుల బదిలీల జాప్యం కారణంగా ప్రక్రియ నెమ్మదించింది. అధికారుల లెక్కల ప్రకారం కేవలం 67 శాతం మాత్రమే పూర్తయింది. దీంతో రైతులకు ప్రభుత్వ పథకాలు అందే విషయంలో ఆందోళన నెలకొంది.

పామర్రు శివారు శ్యామలాపురం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో తలగల ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై రాజేంద్రప్రసాద్ తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించామని చెప్పారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.