Krishna

News August 8, 2025

కృష్ణా: నాటు తుపాకులు ఉంటే.. కాల్ చేయండి

image

ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే లైసెన్స్ లేని నాటు తుపాకులు కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఆర్. గంగాధరరావు హెచ్చరించారు. నాటు తుపాకులు ఉంచడం నేరమని, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారని చెప్పారు. ఈ విషయంలో ఎవరికైనా సమాచారం ఉంటే ఎస్పీ నంబర్ 9440796400కు తెలియజేయవచ్చని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు.

News August 7, 2025

తేలప్రోలు: ‘భారతాన్ని ప్రపంచ నాయకత్వానికి తీసుకెళ్లాలి’

image

తేలప్రోలులోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌లో గురువారం పట్టభద్రుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ‘యువత ఆత్మనిర్భర్ భారత్‌కు రాయబారులుగా, అమృత కాలంలో దేశాభివృద్ధికి శక్తులుగా నిలవాలి’ అన్నారు. AI, రోబోటిక్స్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో యువత ఆవిష్కరణలు చేసి భారతాన్ని ప్రపంచ నాయకత్వానికి తీసుకెళ్లాలన్నారు.

News August 6, 2025

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా: పిల్లలు లేరని వేధింపులు.. మహిళ ఆత్మహత్య
☞ యువతే దేశ భవిష్యత్తుకు మార్గదర్శులు: వెంకయ్యనాయుడు
☞ గుడివాడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
☞ కృష్ణా: పదవుల కోసం తెలుగు తమ్ముళ్ల ఎదురుచూపు
☞ విజయవాడ: హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్
☞ విజయవాడ: 8 నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు
☞ కృష్ణా: పరీక్షల టైం టేబుల్ విడుదల

News August 6, 2025

కృత్తివెన్ను: పిల్లలు లేరని వేధింపులు.. మహిళ ఆత్మహత్య

image

కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల మేరకు.. స్థానికంగా నివసిస్తున్న స్వాతి (23)కి, పల్లెపాలెంకు చెందిన కుమారస్వామితో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి సంతానం లేకపోవడంతో భార్యాభర్త మధ్య తరచూ గొడవలు, అత్తింటివారి వేధింపులతో బాధపడేది. ఈ క్రమంలో ఆమె మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కృత్తివెన్ను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 6, 2025

GDV: ఆర్టీసీ డిపోలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

గుడివాడ ఆర్టీసీలో డిపోలో కాంట్రాక్టు ప్రాతిపదికన డ్రైవర్లుగా పని చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ మంగళవారం తెలిపారు. డ్రైవర్లుగా పనిచేయాలనుకునేవారికి తప్పనిసరిగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 12లోపు గుడివాడ డిపో మేనేజర్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి రోజువారీ జీతం చెల్లిస్తామన్నారు.

News August 6, 2025

బాపులపాడులో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ తనిఖీలు

image

బాపులపాడు మండలంలోని పెరికిడు, కానుమోలు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, హైస్కూల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం సరిగా పెడుతున్నారా.? లేదా.? తెలుసుకున్నారు. ఆయన వెంట డీఈఓ రామారావు ఉన్నారు.

News August 6, 2025

కృష్ణా: పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురు చూపు

image

బందరు పార్లమెంట్ పరిధిలో TDP పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గ్రామ పార్టీ అధ్యక్ష పదవులు పలుచోట్ల పూర్తికాగా కొన్నిచోట్ల ఎదురుచూస్తున్నారు. మండల అధ్యక్షుడి పదవితో పాటు, పార్టీ విభాగాలకు సంబంధించిన పదవుల కోసం కూడా పలువురు పోటీ పడుతున్నారు. మహానాడు అయ్యాక పదవులు కేటాయిస్తారని ఎదురు చూసిన వారికి నిరాశ ఎదురైంది. ఇప్పటికీ పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తూనే ఉన్నారు.

News August 5, 2025

ఇకపై మూల్యాంకన పుస్తకాల్లోనే అన్ని పరీక్షలు

image

పాఠశాల విద్యలో మార్పులకు శ్రీకారం చుట్టిన AP ప్రభుత్వం పరీక్షలను పేపర్లపై కాకుండా పుస్తకాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టింది. ప్రతి సబ్జెక్టుపై ప్రత్యేకంగా రూపొందించిన ఎస్ఎస్మెంట్ పుస్తకాలను మండల విద్యావనరుల కేంద్రాలకు సరఫరా చేసింది. వీటిని పాఠశాలలకు పంపి అన్ని పరీక్షలను పుస్తకాల్లోనే రాయాలని ఆదేశాలిచ్చింది. 11 నుంచి నిర్వహించనున్న ఫార్మేటివ్-1 పరీక్షలు వీటిలోనే నిర్వహించనున్నారు.

News August 5, 2025

కృష్ణా: 104 వాహనాలు సిద్ధం.. త్వరలో అందుబాటులోకి

image

బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో ఆధునిక సదుపాయాలతో కొత్త ‘సంజీవని’ 104 వాహనాలు సిద్ధమవుతున్నాయి. పాత నీలం రంగును తొలగించి, తెలుపు, ఎరుపు, పసుపు రంగులతో కొత్త రూపునిచ్చారు. ఈ వాహనాలపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రాలను ముద్రించారు. త్వరలో ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

News August 5, 2025

కృష్ణా: నవోదయ దరఖాస్తులకు గడువు పొడిగింపు

image

జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 13లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. JNV అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.