India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును విజయవాడ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు, నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు స్థానిక సమస్యలను వివరించగా, ఆయన వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
కృష్ణాజిల్లాలో నేటి ముఖ్యంశాలు * కృష్ణా జిల్లాలో ఇంటర్ మొదటి రోజు పరీక్షకు 98.03% హాజరు* విజయవాడలో పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ * కృష్ణా: ప్రజలపై బాలకృష్ణ ఆగ్రహం..YCP రియాక్షన్ * కృష్ణా: అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్స్ * కృష్ణ విశ్వవిద్యాలయం ఇన్చార్జి రిజిస్టర్‌గా ఆచార్య ఉష * కృష్ణా జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్టు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు విద్యాశాఖాధికారి పీబీ సాల్మన్ రాజు తెలిపారు. తొలిరోజు పరీక్షకు 98.03% మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మొత్తం 24,810 మందికి గాను 24,323 మంది పరీక్షకు హాజరయ్యారని, 487 మంది గైర్హాజరయ్యారన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు జిల్లాలో నమోదు కాలేదన్నారు.
కృష్ణా జిల్లా నిమ్మకూరులో ప్రజలపై సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై వైసీపీ X వేదికగా స్పందించింది. ‘ఎంత అవివేకం ఎంత కుసంస్కారం నీకు బాలయ్య.?’ అని పోస్ట్ చేసి బాలకృష్ణ గ్రామస్థులతో ఉన్న వీడియోను వైసీపీ జత చేసింది.
ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు విద్యార్థులు నిర్ణీత సమయంలో చేరుకొని పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 66 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి.
కొత్త వాహన చట్టాన్ని మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు కృష్ణా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేల జరిమానా విధించనున్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని అధికారులు కోరారు.
వార్షిక బడ్జెట్లో విజయవాడ మెట్రో నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించింది. కాగా మెట్రో పూర్తిచేసేందుకు కేంద్రం 100% భరించేలా గతంలో రాష్ట్రం ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనపై కేంద్రం అధికారిక ప్రకటన ఇచ్చినట్లయితే రాష్ట్రం నుంచి మరిన్ని నిధుల కేటాయింపుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం విజయవాడ మెట్రోపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 63 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 45,430 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 43,795 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1635 మంది ఉన్నారు. ఫస్టియర్‌కు సంబంధించి జనరల్ విద్యార్థులు 23,630, ఒకేషనల్ విద్యార్థులు 927 మంది, సెకండియర్‌కు సంబంధించి జనరల్ విద్యార్థులు 20,175, ఒకేషనల్ విద్యార్థులు 708 మంది ఉన్నారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులు రూ.45 లక్షలతో మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. జీజీహెచ్‌లో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.
కృష్ణా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఆచార్య ఎన్. ఉష నియమితులయ్యారు. ఇప్పటి వరకు రిజిస్ట్రార్‌గా పని చేసిన ఆచార్య కె శోభన్ బాబు డిప్యూటేషన్‌పై రాగా ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో ఈ నియామకం జరిగింది. శుక్రవారం ఉష బాధ్యతలు స్వీకరించారు. ఆచార్య ఎంవి బసవేశ్వర్ రావు, పలువురు ఆచార్యులు, సహాయ ఆచార్యులు ఆమెను అభినందించారు.
Sorry, no posts matched your criteria.