India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సీజన్ 2025 -26 సంవత్సరానికి సంబంధించి ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పెనమలూరు మండలం పోరంకిలోని 3వ సచివాలయం నుంచి వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం సేకరణకు చేపట్టాల్సిన పటిష్ట చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
కానూరులో నివాసం ఉంటున్న మధులత 5ఏళ్ల నుంచి సోరియాసిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. భర్త నాగేశ్వరరావుకు మందులు తీసుకురమ్మని వాట్సాప్‌లో చీటీ పెట్టగా.. అందులో అండర్ లైన్ చేసిన మందు మాత్రమే భర్త తీసుకువచ్చాడు. అన్ని మందులు తేకుండా ఒక ముందు మాత్రమే తెచ్చాడని భర్తను ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్థాపానికి గురైన మధులత ఇవాళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
‘సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా, ఈ నెల 10, 11 తేదీలలో ఎలక్ట్రానిక్ వస్తువులతో కూడిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను నిర్వహించాలని కలెక్టర్ బాలాజీ సంబంధిత అధికారులను బుధవారం ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, వినియోగదారులకు తగ్గింపు ధరల్లో వస్తువులు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలోని గృహ నిర్మాణాల పురోగతిపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను హెచ్చరించారు. ఆయన కలెక్టరేట్‌లోని PGRS మీటింగ్ హాలులో గృహ నిర్మాణ పురోగతిపై ఆయన సమీక్షించారు. జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలకు కేవలం 2 లేదా 3 మాత్రమే పూర్తి చేస్తున్నారని ఇది ఎంత మాత్రం సరైనది కాదన్నారు.
వ్యవసాయంతో పాటు అనుబంధంగా కొరమీను చేపల సాగు చేయడం వల్ల రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జీవనోపాదుల మెరుగుదలపై మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. కొరమీను చేపలను తక్కువ స్థలంలోనే పెంచవచ్చని, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో, తక్కువ పెట్టుబడితో లాభదాయకంగా ఉంటుందన్నారు.
పమిడిముక్కల మండలం తాడంకి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సీఐ చిట్టిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చీకుర్తి నరసింహారావు (50) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు.
కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పి.యుగంధర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న యుగంధర్‌ని పదోన్నతిపై కృష్ణాజిల్లా డీఎంహెచ్ఓగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా వెంకట్రావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో యుగంధర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17 బాల బాలికల తైక్వాండో జట్ల ఎంపికలు సోమవారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఐఎంసీ స్టేడియంలో జరిగిన ఈ ఎంపికలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని దుర్గారావు తెలిపారు. ఉత్సాహంగా జరిగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేశారు.
కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో ఈ నెల 9న విజయవాడలోని KBN కాలేజీలో అండర్-19 చెస్ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన సూచించారు.
కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో ఈ నెల 10న నూజివీడులోని ఐఐటీ కళాశాలలో అండర్-19 బేస్ బాల్, యోగా జిల్లా జట్ల ఎంపికలు జరుగుతాయి. ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని కార్యదర్శి రవికాంత తెలిపారు. క్రీడాకారులు తప్పనిసరిగా స్టడీ సర్టిఫికెట్, ఎంట్రీ ఫారం తీసుకురావాలని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.