India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉయ్యూరులోని షుగర్ ఫ్యాక్టరీ 1941లో స్థాపించబడింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి చక్కెర తయారీ యూనిట్లలో ఒకటిగా పేరు గాంచింది. ఈ ఫ్యాక్టరీని ప్రస్తుతం KCP షుగర్ అండ్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోంది. ఇది కేవలం చక్కెరే కాకుండా, స్పిరిట్, ఇథనాల్, విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇది చెరకు రైతులకు నాణ్యమైన ధర కల్పించడంతో పాటు, గ్రామీణ అభివృద్ధికి, స్థానికులకు ఉపాధి అవకాశాలను అందిస్తూ వారి కలలకు రూపం ఇస్తోంది.
కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని 16వ జాతీయ రహదారిపై రోజువారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలు, వేగ నియంత్రణ లోపం కారణంగా ఇక్కడ తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి రహదారిపై ప్రత్యేకంగా ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే ట్రామాకేర్ యూనిట్ ఏర్పాటును ఆచరణలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
కృష్ణాజిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్ 14, 17 బాల బాలికల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ ఎంపికలు ఈనెల 7న ఉదయం 9 గంటలకు నున్న ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమవుతాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, పాఠశాల HM సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తీసుకురావాలని SGF కార్యదర్శులు దుర్గారావు, రాంబాబు తెలిపారు.
మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండలం, మున్సిపల్ కార్యాలయాలలోనూ నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను ఆయా కార్యాలయాలు లేదా కలెక్టరేట్‌లో అందజేయవచ్చన్నారు.
గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడు గేటు వద్ద లారీ ఢీకొన్న ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. గుడివాడలోని కాకర్ల వీధికి చెందిన సూర్యారావు చిన్నఎరుకపాడు నుంచి స్వగృహానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో అతన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మచిలీపట్నంలో చికెన్, మటన్ ధరలు గత వారం రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. చికెన్ విత్ స్కిన్ కిలో ధర రూ. 200 ఉండగా స్కిన్ లెస్ కిలో ధర రూ. 220 అమ్మకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మటన్ కిలో ధర మచిలీపట్నంలో రూ. 1000 ఉండగా, పల్లెల్లో కిలో మటన్ ధర రూ. 800కి విక్రయాలు జరుగుతున్నాయి. మచిలీపట్నం డివిజన్ పరిధిలో ఉన్న మాంసం దుకాణదారులు మొత్తం ఈ రేట్లకే అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
కృష్ణా జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని దేశంలోనే ఆదర్శవంతమైన శాఖగా నిలిపేందుకు కృషి చేస్తామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ZP మీటింగ్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నూతన మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమ’ కార్యకర్త డాక్టర్ రామకృష్ణ ప్రసాద్‌ను జిల్లా కమిటీ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు.
కృష్ణా జిల్లాలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ ద్వారా 11,316 మంది డ్రైవర్లు మొత్తం రూ.16.97 కోట్లు లబ్ధి పొందనున్నారు. ఇందులో అవనిగడ్డలో 1,356 మందికి రూ.2.03 కోట్లు, గన్నవరం 1,550 మందికి రూ.2.32 కోట్లు, గుడివాడ 1,543 మందికి రూ.2.31 కోట్లు, మచిలీపట్నం 1,867 మందికి రూ.2.80 కోట్లు, పామర్రు 1,559 మందికి రూ.2.33 కోట్లు, పెడన 1,375 మందికి రూ.2.06 కోట్లు, పెనమలూరు 2,066 మందికి రూ.3.09 కోట్లు మేర లబ్ధి చేకూరనుంది.
జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళికబద్ధంగా ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ నవీన్ తో కలిసి ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. గత సంవత్సరంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఖరీఫ్‌లో చాలా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇందుకోసం ముందుగానే ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు.
కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 10న నూజివీడులోని ఐఐటీ కళాశాలలో అండర్-19 సాఫ్ట్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని ఎస్‌జీఎఫ్ అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, అలాగే పాఠశాల HM సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తప్పనిసరిగా తీసుకుని రావాలని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.