India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 15వ తేదీన మంగినపూడి బీచ్ వద్ద జరిగే సముద్ర స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. సముద్ర పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన పడవలు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు.
2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె.కన్నబాబు పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శిగా సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న కన్నబాబుకు మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. అనంతరం కె.కన్నబాబు మంత్రి నారాయణతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఏపీఎస్ ఆర్టీసీకి మరోసారి ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డు రావడంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని, ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డును దక్కించుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత, డిజిటల్ టికెట్ల జారీ వల్ల అవార్డు దక్కిందన్నారు.
బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 2 నెలల పాటు 5,200 మందికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేశారన్నారు. సీఎం సూచనలతో బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న ప్రతి అర్జీని పరిశీలించి సత్వర పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎస్పీలు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీలు ప్రజల నుంచి 66 అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను విన్న వారు అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. వారికి చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమాన్ని సోమవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెర్టర్ డీకే బాలాజీ, ఎస్పీ ఆర్ గంగాధరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై కలెక్టర్ డీకే బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10.30గంటలకు కూడా మీకోసం కార్యక్రమానికి పలు శాఖల అధికారులు రాకపోవడాన్ని గమనించిన ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులకు సంబంధించి వాట్సాప్ గ్రూపు తాను పెట్టే మెసేజ్‌లను కూడా కొంత మంది చూడటం లేదన్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ(2010-11 నుంచి 2014-15 అకడమిక్ ఇయర్) వన్ టైం ఆపర్చ్యూనిటీ థియరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 25లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు డిసెంబర్ 30 నుంచినిర్వహిస్తామని, ఫీజు వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
మచిలీపట్నంలోని సాయిబాబా ఆలయంలో ఒకేసారి అందరి దేవుళ్లను దర్శించుకోవచ్చు. ఈ బాబా విగ్రహం ఎత్తు 44, వెడల్పు 45 అడుగులు ఉంటుంది. 2011 ఆగస్టులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్రపంచంలోనే ఎత్తైన సాయిబాబా విగ్రహంగా ప్రకటించారు. ఈ ఆలయంలో పలు రూపాలలో బాబా దర్శనం ఇస్తాడు. ఇక్కడ హిందూ, ముస్లీం, క్రైస్తవ మతాలకు చెందిన దేవుళ్లు ఉండటం విశేషం. ఈ బాబా కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.