India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గూడూరు(M) జొన్నలరేవు సమీపంలోని బందరు కాలువలో సోమవారం పదో తరగతి విద్యార్థి మృతి చెందిన విషయం విధితమే. రాయవరం గ్రామానికి చెందిన ఉద్దంటి దేవ హర్ష (16) ప్రస్తుతం పదో తరగతి చదువుతూ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం పరీక్ష రాసి ఇంటికి వచ్చిన హర్ష, స్నేహితులతో కలిసి సరదాగా జొన్నలరేవు సమీపంలోని బందరు కాలువ వద్దకు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

జిల్లాలోని LPG గ్యాస్ వినియోగదారులకు జాయింట్ కలెక్టర్ నవీన్ ముఖ్య సూచన చేశారు. LPG గ్యాస్ వినియోగదారులంతా సహజ వాయు పైప్ లైన్ల ద్వారా సరఫరా అవుతున్న PNG గ్యాస్ వినియోగం వైపు మొగ్గు చూపాలని కోరారు. నాగాయలంకలోని రిఫైనరీ నుంచి 400 కిలో మీటర్ల మేర జిల్లాలో PNG గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. పైప్‌లైన్ సౌకర్యం ఉన్న ప్రాంత వినియోదదారులంతా PNG గ్యాస్ కనెక్షన్లు తీసుకోవాలని కోరారు.

జిల్లాలోని LPG గ్యాస్ వినియోగదారులకు జాయింట్ కలెక్టర్ నవీన్ ముఖ్య సూచన చేశారు. LPG గ్యాస్ వినియోగదారులంతా సహజ వాయు పైప్ లైన్ల ద్వారా సరఫరా అవుతున్న PNG గ్యాస్ వినియోగం వైపు మొగ్గు చూపాలని కోరారు. నాగాయలంకలోని రిఫైనరీ నుంచి 400 కిలో మీటర్ల మేర జిల్లాలో PNG గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. పైప్‌లైన్ సౌకర్యం ఉన్న ప్రాంత వినియోదదారులంతా PNG గ్యాస్ కనెక్షన్లు తీసుకోవాలని కోరారు.

కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అరుణకు పదోన్నతి లభించింది. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్ సీఈఓగా వ్యవహరించిన కన్నమ నాయుడును పంచాయతీ రాజ్ శాఖ హెడ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారిణిగా ఆమె సమర్ధవంతమైన సేవలు అందించారు.

పదో తరగతి పరీక్షలు జిల్లాలో సజావుగా సాగుతున్నాయి. సోమవారం సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 21,673 మంది విద్యార్థులకు గాను 21,336 మంది హాజరయ్యారు. 307 మంది గైర్హాజరయ్యారని కృష్ణా డీఈఓ యూవీ సుబ్బారావు తెలిపారు. ఓపెన్ స్కూల్ పరీక్షకు సంబంధించి 669 మందికి 471 మంది హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.

పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ సందర్భంగా మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణం అర్జీదారులతో కిటకిటలాడుతోంది. కలెక్టరేట్ మీటింగ్ హాలులో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ పీజీఆర్ఎస్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. పలు కౌంటర్లు ఏర్పాటు చేసి అంశాల వారీగా ప్రజల నుంచి అధికారులు రెవెన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు.

కృష్ణా జిల్లాలో బెట్టింగ్‌ల నియంత్రణకు పోలీసులు చేపట్టిన కౌన్సెలింగ్ ప్రక్రియ రాజకీయ వివాదానికి దారితీసింది. మచిలీపట్నం రూరల్ సర్కిల్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కేవలం YCP సానుభూతిపరులనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సెలింగ్‌కు గైర్హాజరైన TDP వర్గీయులపై చర్యలు తీసుకోలేదని, ఏకపక్షంగా బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో 133 మంది పందెం రాయుళ్లపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల కారణంగా బెట్టింగ్లను అరికట్టేందుకు గాను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గతంలో పలు రకాల బెట్టింగ్లకు పాల్పడిన 133 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు.

బాపులపాడు మండలంలో ఆదివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. వేలేరు సమీపంలో టిప్పర్ లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో జవహర్ నవోదయ ప్రిన్సిపల్ యాదూనందన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. ప్రతి సోమవారంలాగే ఈ వారం కూడా ఉదయం 11 గంటల నుంచి కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించనున్నట్లు ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్, మండల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చి త్వరితగతిన పరిష్కారం పొందాలని కలెక్టర్ సూచించారు.
Sorry, no posts matched your criteria.