Krishna

News March 29, 2026

మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర ఎంతంటే!

image

మచిలీపట్నంలో ఆదివారం మాంసం మార్కెట్ కళకళలాడుతోంది. చికెన్ స్కిన్ లెస్ కిలో రూ. 270, విత్ స్కిన్ రూ. 260గా ఉంది. మటన్ ధర పట్టణంలో కేజీ రూ. 1000 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో కేజీ రూ. 800గా కొనసాగుతోంది. జలపుష్పాలకు కూడా గిరాకీ పెరిగింది. రొయ్యలు కేజీ రూ. 300, పీతలు కేజీ రూ. 300 చొప్పున విక్రయిస్తున్నారు. చేపల్లో కట్లా రకం కేజీ రూ. 200 ఉండగా, రాగండి కేజీ రూ.170 పలుకుతోంది.

News March 28, 2026

మచిలీపట్నం: కలెక్టరేట్‌లో నారాయణచార్యులు జయంతి

image

ప్రముఖ తెలుగు కవి, సాహిత్య విమర్శకులు పుట్టపర్తి నారాయణచార్యులు జయంతి కార్యక్రమాన్ని శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ డీకే బాలాజీ నారాయణచార్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. తెలుగులో ఆయన రచించిన కావ్యాల గురించి కలెక్టర్ ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.

News March 28, 2026

కృష్ణా: పదో తరగతి బయోలాజికల్ సైన్స్ పరీక్ష ప్రశాంతం

image

పదో తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం బయోలాజికల్ సైన్స్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 148 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈవో యూవీ సుబ్బారావు తెలిపారు. 21,716 మంది విద్యార్థులకు గాను 21,408 మంది హాజరయ్యారన్నారు. 308 మంది గైర్హాజరు కాగా హాజరు శాతం 98.18% నమోదైందన్నారు. డీఈవోగా తాను 4 కేంద్రాలను తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ 32 కేంద్రాలను తనిఖీ చేశాయన్నారు.

News March 27, 2026

మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించండి: MP బాలశౌరి

image

మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కోవిడ్ సమయంలో మచిలీపట్నం-తిరుపతి రైలును నిలిపివేశారని, అప్పటి నుంచి మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిలిచిపోయిన రైలును పునరుద్ధరించాలన్నారు.

కృష్ణా: డీపీఓ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు

image

కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి వారి కార్యాలయంపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ఓ కీలక అధికారి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఈ అధికారి పంచాయతీ కార్యదర్శులను టార్గెట్ చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇవ్వని వాళ్లను ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 14ఏళ్లుగా ఆయన ఇక్కడే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం.

News March 27, 2026

కృష్ణా: IPL సీజన్.. బెట్టింగ్ మాఫియాపై పోలీసుల నిఘా

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్ మాఫియాను అరికట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే బెట్టింగ్ కార్యకలాపాలపై దృష్టి సారించిన జిల్లా పోలీస్ యంత్రాంగం అనుమానాస్పద స్థావరాలపై నిఘా ఏర్పాటు చేసి పటిష్ఠ చర్యలకు సిద్ధమైంది. పట్టణ ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉండటంతో, బెట్టింగ్ నిర్వాహకులు తమ కార్యకలాపాలను పల్లె ప్రాంతాలకు మళ్లించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కృష్ణా: ఖరీఫ్ ధాన్యం సేకరణపై కలెక్టర్ సమీక్ష

image

ధాన్యం కొనుగోళ్లలో రైతుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
గురువారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖాధికారులతో సమావేశమైన కలెక్టర్ ధాన్యం సేకరణపై సమీక్షించారు. జిల్లాలో 54,678 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన కేంద్రాల ఏర్పాటు, సాంకేతిక సిబ్బంది నియామకంతో పాటు వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు.

News March 26, 2026

కృష్ణా: ‘అన్ని ప్రభుత్వ సంస్థల్లో స్వచ్ఛ ఆంధ్ర నిర్వహించాలి’

image

నాల్గో శనివారం సందర్భంగా ఈ నెల 28న జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, అపార్ట్‌మెంట్లలో స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మచిలీపట్నంలోని తన చాంబర్ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఒక్కరు పరిశరాల శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.