India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 11న ప్రారంభమై ఇవాళ నిరవధిక వాయిదా పడ్డాయి. కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదినం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా MLAలు కేక్ కట్ చేసి ప్రశాంతిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల అనంతరం హోంమంత్రి అనిత అందరినీ తన ఫోన్‌తో సెల్ఫీ తీశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మన MLAలు భూమా అఖిలప్రియ, గౌరు చరితా పాల్గొన్నారు.
టీడీపీలో పనిచేసిన మరికొందరికి ప్రభుత్వ పదవులు ఇప్పించేందుకు కృషిచేస్తానని కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ పదవులు పొందిన వారిని సన్మానించారు. కుడా ఛైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కురువ ఫెడరేషన్ ఛైర్మన్‌గా దేవేంద్రప్ప, వాల్మీకి ఫెడరేషన్ ఛైర్ పర్సన్‌గా బొజ్జమ్మకు అవకాశం లభించిందన్నారు. కార్పొరేషన్లలో సభ్యులు మరికొందరికి వచ్చాయన్నారు.
విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలని డీఈవో శామ్యూల్ పాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆదోని మండలం విరుపాపురం జడ్పీహెచ్ స్కూలును ఆయన సందర్శించారు. ఈనెల చివరి నాటికి సిలబస్ కంప్లీట్ చేసి, విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు కృషి చేయాలన్నారు.
కర్నూలులో ఇద్దరు పిల్లలకు రంగులు వేసి బలవంతంగా భిక్షాటన చేయిస్తున్నారని మంత్రి లోకేశ్ చేసిన ట్వీట్‌పై ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకుంది. ఈ మేరకు వారిని రక్షించింది. దీనిపై తక్షణమే స్పందించిన కర్నూలు పోలీసులను మంత్రి లోకేశ్ అభినందించారు. ‘భవిష్యత్తులో పిల్లలపై ఇలాంటి వేధింపులు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి’ అని ‘X’లో ఆదేశించారు.
వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని శనివారం చేపట్టే కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సురేశ్ శుక్రవారంపిలుపునిచ్చారు. గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. రూ.10,000 జీతం ఇస్తామన్న సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. లేదంటే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు MLA డా.బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రజా పద్దుల కమిటీ(PAC) సభ్యునిగా ఎన్నికయ్యారు. అటు అంచనాల కమిటీ సభ్యులుగా ఆళ్లగడ్డ, ఆదోని MLAలు భూమా అఖిలప్రియ, డా.పార్థసారథి ఎన్నికయ్యారు. కాసేపటి క్రితమే అసెంబ్లీ కమిటీల ఎన్నికలకు కౌంటింగ్ పూర్తికాగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గెలుపొందిన సభ్యుల వివరాలను ప్రకటించారు.
ఆస్పరి మండలం హలిగేర గ్రామంలోని ఓవర్ హెడ్ ట్యాంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారని స్థానికులు ఆరోపించారు. పసుపు, కుంకుమ, టెంకాయలతో పూజలు చేశారన్నారు. సమీపంలో పాఠశాల ఉండటంతో పిల్లలు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
పత్తికొండలో రెవెన్యూ డివిజనల్ స్థాయి సమావేశం కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో బత్తాయి తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని, బత్తాయి పెంపకంలో అనంతపురం జిల్లా రైతులను ఆదర్శంగా తీసుకోవాలని రైతులను కోరారు. డ్రిప్ పండ్లతోటల ద్వారా మంచి దిగుబడిన సాధించిన రైతుల విజయ గాథలను రైతులకు వీడియోల ద్వారా తెలిపి ప్రోత్సహించాలని కోరారు.
ఆయుధాల పనితీరుపై పోలీస్ సిబ్బంది పరిజ్ఞానం పెంచుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు శివారులోని జగన్నాథ గట్టు సమీపంలో పోలీస్ సిబ్బందికి నిర్వహిస్తున్న ఫైరింగ్ శిక్షణను పరిశీలించారు. ఎప్పటికప్పుడు ఆయుధాల పరిజ్ఞానంపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఆయుధ నైపుణ్యాన్ని పరిశీలించారు.
నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ రావి ఆకుపై శివుడి రూపాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు. ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ఈ చిత్రం కార్తీక శోభను సంతరించుకుందని తెలిపారు. ఆకుపై ఒక క్రమ పద్ధతిలో బ్లేడు సహాయంతో చిత్రాన్ని రూపొందించానని తెలిపారు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ శివ ఆరాధన చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.