India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 6న ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు కర్నూలులో జిల్లాస్థాయి మారథాన్ 5 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ వెల్లడించారు. కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో క్రీడా అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. 17 నుంచి 25 ఏళ్లు కలిగిన విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొనవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎస్డీఓ భూపతి పాల్గొన్నారు.
కర్నూలులో చేపడుతున్న సుందరీకరణ పనులను ఈనెల 30 నాటికి పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల, విజ్ఞాన మందిర్, బంగారు పేట, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణం, సుందరీకరణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిధులు మంజూరు చేసి 6 నెలలు అయినా పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పోలీసుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తోందని అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మృతి చెందిన ఆరు హోంగార్డు కుటుంబాలకు అడిషనల్ ఎస్పీ రూ.2 లక్షల ప్రకారం కాంట్రిబ్యూషన్ వెల్ఫేర్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా పోలీసు కుటుంబాలకు రావలసిన బెనిఫిట్స్ త్వరితగతిన అందజేస్తామన్నారు.
కర్నూలులో 4వ తేదీన జరగబోయే గణేశ్ నిమజ్జన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం కేఎంసీ కమిషనర్ విశ్వనాథ్‌తో కలిసి కేసీ కెనాల్ ఘాట్‌ను తనిఖీ చేశారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ఉత్సవ సమితి నాయకులు వినాయక నిమజ్జన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కర్నూలుకు చెందిన YSR వీరాభిమాని సంజీవ్ తనను కలవడంపై APCC అధ్యక్షురాలు షర్మిల X వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ‘అభిమానానికి అంగ వైకల్యం అడ్డు కాదని సంజీవ్‌ను చూస్తే అర్థం అవుతుంది. కర్నూలు నుంచి వచ్చి పుష్పగుచ్ఛం ఇవ్వడంతో YSR మీద ప్రేమ కనిపించింది. దివ్యాంగుల జీవితాల్లో వికాసం రావాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో రావాలని చెప్పిన మాటలు నూతన ఉత్తేజాన్ని కలిగించాయి’ అని పేర్కొన్నారు.
కర్నూలుకు చెందిన YSR వీరాభిమాని సంజీవ్ తనను కలవడంపై APCC అధ్యక్షురాలు షర్మిల X వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ‘అభిమానానికి అంగ వైకల్యం అడ్డు కాదని సంజీవ్‌ను చూస్తే అర్థం అవుతుంది. కర్నూలు నుంచి వచ్చి పుష్పగుచ్ఛం ఇవ్వడంతో YSR మీద ప్రేమ కనిపించింది. దివ్యాంగుల జీవితాల్లో వికాసం రావాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో రావాలని చెప్పిన మాటలు నూతన ఉత్తేజాన్ని కలిగించాయి’ అని పేర్కొన్నారు.
ఆదోని మండలం హరివాణంలో ఆదివారం ఎల్లెల్సీ కెనాల్ వద్ద జరుగుతున్న గణేశ్ష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షించారు. నిమజ్జనం సజావుగా సాగేలా గట్టి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. వినాయక నిమజ్జనం పూర్తి అయ్యేవరకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మార్క్‌ఫెడ్ ద్వారా రూ.12కు ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తుందని, అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఆదివారం మార్కెటింగ్, మార్కెట్ యార్డ్ సెక్రటరీ అధికారులతో ఉల్లి కొనుగోలు అంశంపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా మార్కెట్ యార్డులలో కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించారు.
దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన 8 మంది డీఎస్సీలో సత్తా చూపారు. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని, వారి తల్లిదండ్రులను బీసీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బుజ్జమ్మ సన్మానించారు. తన ఊరిలో 8 మంది ఉపాధ్యాయులుగా ఎంపికవ్వడం ఆనందంగా, గర్వంగా ఉందని ఆమె తెలిపారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం కష్టంగా ఉన్న ఈ పోటీ ప్రపంచంలో నందవరానికి చెందిన కురవ పెద్దనాగన్న, హనుమంతమ్మ కుమారుడు K.P నాగరాజు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. రైల్వే, సచివాలయం ఉద్యోగాలు సాధించి తాజాగా విడుదలైన డీఎస్సీలో (SA సోషల్) కొలువు సాధించాడు. నాగరాజు అన్న హెడ్ కానిస్టేబుల్, తమ్ముడు 2012 DSC లో SGTగా ఉద్యోగం సాధించారు. పెద్దనాగన్న కుమారులు గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Sorry, no posts matched your criteria.