Kurnool

News September 6, 2024

వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: ఎస్పీ

image

నంద్యాల జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, అధికార యంత్రాంగానికి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మట్టి ప్రతిమను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో విఘ్నాలు తొలగిపోయి, విజయాల సిద్ధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. కాగా పోలీసుల అనుమతులకు లోబడి వేడుకలు నిర్వహించుకోవాలని నిర్వాహకులకు ఎస్పీ సూచించారు.

News September 6, 2024

రింగ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

బీ.తాండ్రపాడు నుంచి గార్గేయపురం వరకు జరుగుతున్న రింగ్ రోడ్డు పనులను నవంబర్ 15వ తేది నాటికి పూర్తి చేయాలని NH-340C పీడీని కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పలు ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమయాజులపల్లె నుంచి డోన్ రూట్‌కు సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని కర్నూలు ఆర్డీఓను ఆదేశించారు.

News September 6, 2024

93 పరిశ్రమల యూనిట్లకు రూ.8.43 కోట్ల సబ్సిడీ మంజూరు: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించే నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ జీ.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 93 పరిశ్రమల యూనిట్లకు రూ.8.43 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని మంజూరు చేశారు.

News September 6, 2024

నందికొట్కూరులో మహిళ దారుణ హత్య

image

నందికొట్కూరులోని మారుతీ నగర్‌కు చెందిన శాలు బీ(45) గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రామాంజీ నాయక్, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 8 మంది అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2024

శ్రీశైలం మల్లన్న దంపతులకు 108 బంగారు పుష్పాల విరాళం

image

శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామివారికి కర్నూలుకు చెందిన బీసీ శివకుమార్, కుటుంబ సభ్యులు శుక్రవారం బంగారు పుష్పాలను విరాళంగా అందించినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. 19 గ్రాముల బరువు ఉన్న 108 బంగారు పుష్పాలను అందించినట్లు చెప్పారు. బంగారు పుష్పాలను అందించిన దాతలను ఆలయ పండితులు, అర్చకులు స్వామి అమ్మవారి శేష వస్త్రాలతో సన్మానించి ప్రసాదాలు అందజేశారు.

News September 6, 2024

KNL: రెండు విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులుగా జిల్లా నేతలు

image

ఏపీలో 41 అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ జాబితాలో కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు నేతలకు చోటు దక్కింది. బేస్త విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా టీ.అనిల్ కుమార్, వీరశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షుడిగా వై.రుద్ర గౌడ్ నియమితులయ్యారు.

News September 6, 2024

కేంద్ర మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వియాను క‌లిసిన మంత్రి టీజీ భరత్

image

క‌ర్నూలులో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు క‌ల్పించాల‌ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వియాను మంత్రి టీజీ భ‌ర‌త్ కోరారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భరత్.. కేంద్ర మంత్రిని ఆయ‌న నివాసంలో క‌లిశారు. క‌ర్నూలులో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు గల క్రీడా ప్రాంగ‌ణాన్ని నిర్మించాలని, అత్యుత్త‌మ‌మైన కోచ్‌ల‌ను నియ‌మించాల‌ని కోరారు.

News September 5, 2024

CMRFకు కర్నూలు కలెక్టర్ కు పలువురు విరాళాలు

image

విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం సహాయ నిధికి సిండికేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ట్రెజరర్ రిజ్వాన బేగం, ప్రభాకర్, తదితరులు రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ రంజిత్ భాషాకు చెక్కు అందజేశారు. అలాగే ఆదోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కో-ఆపరేటివ్ బ్యాంకు తరఫున DCO రామాంజనేయులు రూ.5 లక్షల చెక్కును కలెక్టర్కు అందజేశారు.

News September 5, 2024

BREAKING: కాటసాని రాంభూపాల్ రెడ్డికి కీలక పదవి

image

YCP నంద్యాల జిల్లా నూతన అధ్యక్షుడిగా మాజీ MLA కాటసాని రాంభూపాల్ రెడ్డి నియమితులయ్యారు. YCP అధినేత, మాజీ CM వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ అధిష్ఠానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో అత్యధిక సార్లు MLAగా కాటసాని రాంభూపాల్ రెడ్డి గెలుపొందారు. దీంతో ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

News September 5, 2024

కర్నూలు జిల్లా YCP అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డి

image

కర్నూలు జిల్లా వైసీపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ అధిష్ఠానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా కార్పొరేటర్ నారాయణమ్మ కొనసాగారు. కాగా, 2014 నుంచి 2019 వరకు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశారు.