Kurnool

News August 24, 2024

సున్నిపెంటలో చిరుత పులి కలకలం

image

శ్రీశైలం మండల కేంద్రం సున్నిపెంటలోని బండ్ల బజారులో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చిరుత పులి కలకలం రేపింది. ఇళ్ల మధ్యకు చిరుత రావటాన్ని గమనించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఓ ఇంటిపై నుంచి దూకి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు చేరవేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇటీవల తరచూ చిరుత సంచారం స్థానికులను ఆందోళకు గురిచేస్తోంది.

News August 24, 2024

కర్నూలు.. ఫలితాలు విడుదల

image

రాయలసీమ విశ్వవిద్యాలయం పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 347 మంది హాజరు కాగా 323 మంది, సప్లిమెంటరీ పరీక్షలకు 73 మంది హాజరుకాగా 56 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సముద్రాల వెంకటేశ్ తెలిపారు.

News August 24, 2024

మరణించిన పోలీస్ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం: ఎస్పీ

image

నంద్యాల: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు శుక్రవారం పోలీస్ శాఖలో పనిచేస్తూ వివిధ కారణాల ద్వారా మరణించిన పోలీస్ వారి కుటుంబ సభ్యులతో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సమావేశం నిర్వహించారు. అనంతరం కుటుంబాల సభ్యుల వివరాలు అడిగి తెలుసుకుని వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీ సంక్షేమానికి అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

News August 23, 2024

కర్నూలు: రైలు నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం

image

కోసిగి రైల్వేస్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి శుక్రవారం దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై పడటంతో కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 23, 2024

అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో బీఏ హానర్స్ స్పెషల్ ఉర్దూ కోర్సు

image

డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో బీఏ హానర్స్ స్పెషల్ ఉర్దూ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వీ.లోకనాథ శుక్రవారం తెలిపారు. బీఏ హానర్స్ స్పెషల్ ఉర్దూలో ఇంటర్మీడియట్, మదరస బోర్డు ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఈ కోర్సు అర్హత వివరాలు ఉర్దూ యూనివర్సిటీ వెబ్ సైట్‌లో పొందుపర్చినట్లు ఆయన తెలిపారు.

News August 23, 2024

ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయం: ఎస్పీ

image

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో ఇవాళ మాజీ CM, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. తుపాకీకి ఎదురుగా వెళ్లి తన గుండెను చూపించిన ధీరుడు ఆంధ్రకేసరి అని ఎస్పీ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఏఎస్పీ, పోలీస్ అధికారులు స్మరించుకున్నారు.

News August 23, 2024

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

image

ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందజేయాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు మండలం గార్గేయపురంలోని పీహెచ్‌సీ, జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోగుల పట్ల వైద్యులు మర్యాదగా నడుచుకోవాలని సూచించారు.

News August 23, 2024

మసీదును ప్రారంభించిన మంత్రి ఫరూక్

image

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నూజివీడు మండలం బోర్వంచ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన మసీదును మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని అన్నారు. మైనార్టీ విద్యార్థులు చదువుకోవడానికి మదరసాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

News August 23, 2024

ఓర్వకల్లు వద్ద అక్రమ ఖనిజం సీజ్

image

బనగానపల్లె నుంచి అక్రమంగా మహారాష్ట్రకు డోలమైట్ ఖనిజాన్ని తరలిస్తున్న టిప్పర్లను ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ వెల్లడించారు. టిప్పర్లలో గ్రావెల్, చిప్స్, డోలమైట్ ఖనిజాలను అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు విస్తృత దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 3 టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకున్నామనన్నారు.

News August 23, 2024

మంత్రి బీసీతో స్పెయిన్ కంపెనీ ప్రతినిధులు భేటీ

image

రాష్ట్రంలో బయో సింథటిక్ వుడ్, హైడ్రో ఫాయిల్ బోట్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు స్పెయిన్ ఆధారిత ఆరియా గ్లోబల్ సంస్థ ఆసక్తి చూపుతోంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు సమావేశమై తమ ప్రతిపాదనలను వివరించారు. రూ.300 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి తెలిపారు.