Kurnool

News August 23, 2024

మంత్రి బీసీతో స్పెయిన్ కంపెనీ ప్రతినిధులు భేటీ

image

రాష్ట్రంలో బయో సింథటిక్ వుడ్, హైడ్రో ఫాయిల్ బోట్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు స్పెయిన్ ఆధారిత ఆరియా గ్లోబల్ సంస్థ ఆసక్తి చూపుతోంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు సమావేశమై తమ ప్రతిపాదనలను వివరించారు. రూ.300 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి తెలిపారు.

News August 23, 2024

Govt Jobs: నంద్యాల పోలీసుల హెచ్చరిక!

image

ఉపాధి కల్పన స్కీం ఫ్రాడ్‌పై నంద్యాల పోలీసులు ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ‘మిమ్మల్ని ఈ విధంగా ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని సంప్రదిస్తే వారిని నమ్మకండి. ఎవరైనా అలా చెబితే, మొదట మీరు ఆ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారో, లేదో చెక్ చేసుకోండి. ప్రజలు ఎవరైనా ఈ విధంగా నష్టపోయి ఉంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌ను కానీ, సైబర్ క్రైమ్ వారిని కానీ ఆశ్రయించండి’ అని పోలీసులు పేర్కొన్నారు.

News August 23, 2024

రికార్డుల నిర్వహణ బట్టి పనితీరును అంచనా వేయొచ్చు: కలెక్టర్

image

రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సర్వీసులు అందిస్తే గ్రీవెన్స్ తగ్గుతాయని, రెవెన్యూ అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రికార్డుల నిర్వహణ తీరును బట్టి అధికారుల పనితీరు అంచనా వేయవచ్చని అన్నారు.

News August 22, 2024

జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహించండి: డీఈఓ

image

జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గురువారం డీఈఓ కార్యాలయంలో జాతీయ అంతరిక్ష దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేజీబీవీ జీసీడీఓ స్నేహలత, అసిస్టెంట్ డైరెక్టర్ శామ్యూల్ పాల్, జిల్లా సైన్స్ అధికారిణి రంగమ్మ పాల్గొన్నారు.

News August 22, 2024

నంద్యాల: ఉల్లిగడ్డల లారీ బోల్తా

image

పాణ్యం మండలంలోని తమ్మరాజు పల్లె గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉల్లిగడ్డల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ఉల్లిగడ్డల బస్తాలన్నీ చెల్లాచెదురయ్యాయి. లారీ డ్రైవర్‌కు గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 22, 2024

సెప్టెంబర్ 11 నుండి కొత్త ఇసుక పాలసీ: కలెక్టర్

image

సెప్టెంబర్ 11 నుండి కొత్త ఇసుక పాలసీని ప్రభుత్వం అమలు చేయబోతుందని కలెక్టర్ రంజిత్ బాషా ప్రకటించారు. ప్రజలు నేరుగా ఇసుక తీసుకోవచ్చు కానీ అక్కడి నుంచి రవాణా కోసం వాహనాలకు ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తామని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 484 గ్రామపంచాయతీలో 4 అంశాలతో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.

News August 22, 2024

నందికొట్కూరులో యువకుడి మృతి

image

నందికొట్కూరులోని పగిడ్యాల రోడ్డు సమీపంలో ఉన్న పాత సామాను షాపులో విద్యుత్ షాక్‌కు గురై మహబూబ్ బాషా(35) గురువారం మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 22, 2024

ఓర్వకల్లులో భారీ అగ్ని ప్రమాదం.. సంస్థ ప్రకటన

image

కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని జై రాజ్ స్టీల్ ప్లాంట్‌లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఎవరికీ గాయాలు కూడా అవ్వలేదని పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాల ప్యానల్స్ మాత్రమే కాలిపోయాయని సంస్థ ప్రతినిధి శ్రీనివాస కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.

News August 22, 2024

హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారూ: భూమా అఖిలప్రియ

image

మెగాస్టార్ చిరంజీవికి ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బర్త్ డే విసెష్ చెప్పారు. ‘దేవుడు మీకు మరింత శక్తి, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. దీనికి గతంలో భూమా, శోభా నాగిరెడ్డితో చిరంజీవి దిగిన ఫొటోతో పాటు ఆమె వివాహ వేడుకలకు చిరు హాజరైన పలు చిత్రాలను జత చేశారు.

News August 22, 2024

కర్నూల్ జిల్లాకు రూ.59.60 కోట్లు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామ పంచాయతీలకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం 2వ విడత నిధులు రూ.59.60 కోట్లు విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజునాయుడు తెలిపారు. నంద్యాల జిల్లాలోని 488 పంచాయతీలకు రూ.28.05 కోట్లు మంజూరు కాగా, కర్నూలు జిల్లాలోని 482 పంచాయతీలకు రూ.31.56 కోట్లు వచ్చాయని వివరించారు.