Kurnool

News August 22, 2024

ఆస్తి కోసమే భర్తను చంపేసింది: డీఎస్పీ సోమన్న

image

ఆదోని మండలం పెద్దహరివాణానికి చెందిన శేఖన్న (50) హత్యకు గురైన విషయం విదితమే. ఈ ఘటనలో మృతుడి భార్యే నిందితురాలని డీఎస్పీ డి.సోమన్న తెలిపారు. మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య జయమ్మ గొంతు కోసి హత్య చేసిందని వివరించారు. రెండెకరాల భూమిని తనకు రాసివ్వాలని ఆమె కోరగా అందుకు భర్త నిరాకరించారు. ఈ క్రమంలో గొడవ పడ్డారు. భర్తను చంపితే ఆస్తిలో సగం వస్తుందని భావించిన ఆమె కొడవలితో గొంతు కోసి హత్య చేసిందని తెలిపారు.

News August 22, 2024

కేఎంసీ ఉద్యోగులు ఆధార్‌‌కు పాన్‌ లింక్ చేయించుకోవాలి: కమిషనర్

image

నగరపాలక సంస్థ ఉద్యోగులు తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకుని వారు వెంటనే చేసుకోవాలని కమిషనర్ రామలింగేశ్వర్ సూచించారు. లింక్ చేసుకోక ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిమానాలు విధించబడిన ఉద్యోగులు, సిబ్బందితో బుధవారం నగరపాలక కౌన్సిల్ హాలులో సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. లింక్ చేయకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 186 మంది ఉద్యోగులకు జరిమానా విధించిందని అన్నారు.

News August 21, 2024

క్యాన్సర్ ఆసుపత్రిని అందుబాటులో కి తీసుకొస్తాం: ఎంపీ

image

సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలులో మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో సాగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో క్యాన్సర్ ఆసుపత్రి పూర్తి కాలేదని, దాదాపు 20శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.

News August 21, 2024

7 మండలాల్లో 4,405 హెక్టార్లలో పంట నష్టం: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కురిసిన నేపథ్యంలో 7 మండలాల్లో 4,405 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంటనే అధికారులు పర్యటించి ప్రాథమిక నివేదికను పంపాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురవడంతో కొన్ని మండలాలలోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, రాత్రి హంద్రీ నదిలో చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు.

News August 21, 2024

నిందితులను కఠినంగా శిక్షించాలి: ఎంపీ

image

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కర్నూలు ఎంపీ నాగరాజు డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మెడికల్ కలశాల ఆవరణంలో జూడాలు నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షకు ఎంపీ సంఘీభావం తెలిపారు. వైద్యురాలిపై జరిగిన ఘటన అత్యంత బాధాకరమని, ఓ మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు.

News August 21, 2024

పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నంద్యాలలోని పశుగణ అభివృద్ధి సంస్థ కార్యాలయం ఘనీకృత పశు వీర్య కేంద్రంలోని లాబ్‌ను బుధవారం ఆమె పరిశీలించారు. కలెక్టర్ రాజకుమారి మొక్కలు నాటిన అనంతరం మాట్లాడారు. పట్టణ పరిధిలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

News August 21, 2024

మత్తుపదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మత్తుపదార్థాల నియంత్రణకు సంబంధించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని ఎస్పీ బిందు మాధవ్‌తో కలిసి నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలను వినియోగించకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

News August 21, 2024

కనువిందు చేసిన ఇంద్రధనస్సు

image

నంద్యాల జిల్లా పరిధిలోని ప్యాపిలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున మబ్బులు కమ్మిన ఆకాశంలో ఇంద్రధనస్సు కనువిందు చేసింది. కొద్ది రోజులుగా ఓవైపు భానుడు సెగలు పుట్టిస్తుండగా.. మరోవైపు వరుణదేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆకాశంలో రంగురంగుల (VIBGYOR) ఇంద్రధనస్సు దర్శనమిచ్చింది. ఈ చిత్రం చూపరులను కట్టిపడేసింది.

News August 21, 2024

అధికారుల తీరుపై మంత్రి బీసీ అసంతృప్తి

image

బనగానపల్లెలోని కరెంట్ ఆఫీస్ ప్రాంతంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. రోడ్లు, డ్రైనేజ్‌ల నిర్వహణ పట్ల అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తామని, అధికారులు ప్రజాసేవపై దృష్టి పెట్టాలని సూచించారు. R&B, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని మంత్రి బీసీ ఆదేశించారు.

News August 21, 2024

కర్నూలులో మోసగాడి అరెస్ట్‌.. ₹18 లక్షలు రికవరీ

image

డబ్బు రెట్టింపు చేస్తానని మోసానికి పాల్పడిన చిన్నసుబ్బరాయుడును కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. భాస్కర్‌ నగర్‌కు చెందిన మహమ్మూద్‌‌కు సుబ్బరాయుడు పరిచయమయ్యాడు. కొంత డబ్బిస్తే రసాయనాలతో రెట్టింపు చేస్తానని నమ్మించాడు. ఆశపడిన మహమ్మూద్‌ రూ.19.50 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఉడాయించడంతో మోసపోయానని తెలుసుకున్న మహమ్మూద్‌ పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ₹18.20 లక్షలను రికవరీ చేశారు.