Kurnool

News July 26, 2024

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం

image

కర్నూలు-కడప జాతీయ రహదారిలోని శిరివెళ్ల మెట్ట వద్ద శుక్రవారం కూల్ డ్రింక్స్ లోడుతో వెళుతున్న ఆటోకు రోడ్డు ప్రమాదం జరిగింది. కోవెలకుంట్ల నుంచి శిరివెళ్ల వైపు వెళుతున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై శిరివెళ్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

News July 26, 2024

బెంగళూరు నుంచి ఓర్వకల్లుకు విమాన సర్వీస్ పునరుద్దరణ: ఎంపీ శబరి

image

బెంగళూరు-ఓర్వకల్లు విమాన సర్వీస్ పునరుద్దరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఓర్వకల్లు నుంచి గతంలో బెంగళూరుకు సర్వీస్ నడిచేదని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సర్వీస్ రద్దయిందని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించి ఆగస్టు 16 నుంచి ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో ఆ సర్వీస్ నడిచేలా పునరుద్దరించామని తెలిపారు. త్వరలో కర్నూలు-విజయవాడకు సర్వీస్ నడుస్తుందన్నారు.

News July 26, 2024

దేవుడి భూములను ఆక్రమించేశారు అధ్యక్షా..!: గౌరు చరితరెడ్డి

image

ఓర్వకల్లు మండలం శకునాలలోని కాశీ విశ్వేశ్వరస్వామి గుడి భూములను YCP నేతలు ఆక్రమించుకుని మట్టిని తవ్వేసుకున్నారని పాణ్యం MLA గౌరు చరతరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ‘నియోజకవర్గంలోని దేవాలయాలు దూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోని పరిస్థితి ఉంది. మాదవాంజనేయ గుడికి ఉన్న 180 ఎకరాలు రిఎల్ ఎస్టేట్ కోసం ఆక్రమించుకున్నారు. వీటిపై కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలి అధ్యక్షా..’ అని అన్నారు.

News July 26, 2024

ట్రాఫిక్ రద్దీ నియంత్రిణకు ప్రణాళిక రూపొందించండి: కలెక్టర్

image

కర్నూలులో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బళ్లారి చౌరస్తా, హాస్పిటల్, రాజ్ విహార్, తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీకి కారణాలను అధికారులతో చర్చించారు. ఎస్పీ జీ.బిందుమాధవ్ మాట్లాడుతూ.. నగరంలో చాలాచోట్ల సీసీ కెమెరాల్లో విజువల్స్ సరిగ్గా కనిపించడం లేదని, దొంగతనాలను కనిపెట్టేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమన్నారు.

News July 26, 2024

నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించండి: కలెక్టర్

image

జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ డిస్టిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నిరుద్యోగ యువతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించి, వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News July 26, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

రహదారులపై ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా రహదారి భద్రతా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారులపై 51 బ్లాక్ స్పాట్స్ గుర్తించామని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు.

News July 25, 2024

‘కేవీపీఎస్ శిక్షణా తరగతులను జయప్రదం చేయండి’

image

కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 1, 2 తేదీల్లో కర్నూలులో జరిగే సామాజిక చైతన్య శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. గురువారం కర్నూలులో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలకులు మారారు తప్ప, దళితుల పరిస్థితులు మాత్రం మారలేదన్నారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.

News July 25, 2024

పాములపాడు మండలంలో హత్యకు కారణమిదే..

image

పాములపాడు మండలం ఇస్వాలకు చెందిన లింగస్వామిని తెలుగుగంగ కాల్వ వద్ద <<13666742>>హత్య <<>>చేసిన సంగతి తెలిసింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ఆత్మకూరు సీఐ నాగభూషణం తెలిపారు. ఆయన వివరాలు..లింగస్వామి ఓ మహిళతో చనువుగా ఉండటం చూసిన ఆమె బంధువైన బాలుడు ఈ విషయాన్ని రుద్రవరానికి చెందిన మహిళ మరిది శేఖర్‌కు చెప్పాడు. బాలుడు, శేఖర్, అతని స్నేహితులైన మద్దిలేటి, సందీప్‌తో కలిసి లింగస్వామిని కత్తితో పోడిచి హత్య చేశారు.

News July 25, 2024

పోతిరెడ్డిపాడు గేట్లను తాకిన కృష్ణా జలాలు

image

జూపాడుబంగ్లా: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయంలోకి 1,75,448 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో డ్యామ్‌లో గంట గంటకు నీటిమట్టం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యాంలో 841 అడుగులకు నీటిమట్టం చేరుకోగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లను కృష్ణ జలాలు తాకాయి. శ్రీశైలం డ్యామ్‌లో 849.80 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు 848.80 అడుగుల నీటిమట్టం నమోదైంది.

News July 25, 2024

కర్నూలు: ఉద్యోగాలు ఇస్తామంటూ..రూ.95లక్షలు మోసం

image

జాబ్స్ ఇస్తామంటూ రూ.95లక్షలు మోసంచేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కర్నూలులోని రిచ్‌మండ్ విల్లాస్‌కు చెందిన అనూష ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ PSలో బుధవారం కేసు నమోదైంది. ‘హైదరాబాద్‌కు చెందిన సురేశ్, ధనలక్ష్మీ, సంతోష్‌ జాబ్స్ ఇస్తామంటూ నమ్మించారు.ఆన్‌లైన్ శిక్షణ ఇస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షలు తీసుకున్నారు. తనతో పాటు బంధువులు,స్నేహితులు మెుత్తం కలిపి రూ.95 లక్షలు మోసపోయామని’ ఫిర్యాదులో పేర్కొంది.