Kurnool

News March 3, 2025

శ్రీలేఖ పాడె మోసిన కర్నూలు డీఈవో

image

సీ.బెలగల్ మండలం పోలకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి శ్రీలేఖ కర్నూలులో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. గోనెగండ్ల మండలం పెద్దనెలటూరులో జరిగిన విద్యార్థిని అంత్యక్రియలలో ఈడీవో శ్యామ్యూల్ పాల్ పాల్గొని, పాడెమోశారు. అంత్యక్రియలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. కాగా, సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో విద్యార్థినిపై చెట్టు విరిగిపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

News March 3, 2025

కేంద్ర రైల్వే మంత్రికి రాఘవేంద్ర ప్రతిష్ఠ అవార్డు ప్రదానం

image

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి గురువు వైభవోత్సవాలు పురస్కరించుకొని ఆదివారం రాఘవేంద్ర స్వామి ప్రతిష్ఠ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగానే కేంద్ర రైల్వే శాఖ మంత్రి సోమన్నకు అవార్డును అందజేశారు. కేంద్ర మంత్రికి అవార్డుతో పాటు రాఘవేంద్ర స్వామి ప్రశంసా పత్రం, జ్ఞాపికను ఇచ్చి శాలువాలతో సత్కరించారు. అనతంరం ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.

News March 2, 2025

కర్నూలు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

➤ నందవరంలో అత్తింటి వేధింపులతో మహిళ సూసైడ్
➤ సీ.బెళగల్ మండలంలో చెట్టు విరిగి పడి బాలిక మృతి
➤ పెద్దకడబూరు: రైతులకు కూటమి ప్రభుత్వం మరోసారి వెన్నుపోటు
➤ బడ్జెట్‌పై ఆలూరు ఎమ్మెల్యే ఆగ్రహం
➤ కర్ణాటకలో జల చౌర్యంపై స్పందించిన కర్నూలు ఎంపీ
➤ కేంద్ర రైల్వే మంత్రికి ప్రతిష్ఠ అవార్డు ప్రదానం

News March 2, 2025

శ్రీలేఖ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: కలెక్టర్

image

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని శ్రీలేఖ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దురదృష్టవశాత్తూ విద్యార్థి శ్రీలేఖ ఆదివారం ఉదయం మృతి చెందిందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.5 లక్షలు ప్రకటించిందన్నారు.

News March 2, 2025

సి. బెళగల్ : చెట్టు విరిగి పడి బాలిక మృతి

image

సి.బెళగల్ మండలం పోలకల్ జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం చెట్టు విరిగిన పడి 8వ తరగతి విద్యార్థిని శ్రీలేఖ గాయపడిన విషయం తెలిసిందే. కాగా బాలిక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఇది దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి విద్యాశాఖ రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని NUSI జిల్లా అధ్యక్షుడు వీరేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

News March 2, 2025

హైదరాబాదులో లింగాలగట్టు యువకుడు ఆత్మహత్య

image

ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాదు నగరంలో జరిగింది. శ్రీశైల మండలం లింగాలగట్టుకు చెందిన నూకరాజు(27) బీటెక్ పూర్తి చేశాడు. అమీర్పేటలోని ఇంటీరియర్ లాడ్జిలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురై అర్ధరాత్రి లాడ్జి గదిలోనే ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని లింగాల గట్టుకు తరలించారు.

News March 2, 2025

శ్రీశైల మల్లన్న టికెట్ల గోల్‌మాల్

image

శ్రీశైల మల్లన్న సన్నిధిలో సర్వదర్శనం టికెట్ల వ్యవహారంలో గోల్‌మాల్ జరిగిన విషయం తెలిసిందే. గత నెల 14న దళారులు నకిలీ టికెట్లురూ .900కు అమ్మారు. పాత టికెట్లపై తేదీలను మార్చి రబ్బరు స్టాంపులతో విక్రయించారు. దీనిని గుర్తించిన కొందరు అధికారులు ఈవో ఎం. శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆలయ సీఎస్ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 2, 2025

నందవరం : అత్తింటి వారి వేధింపులు .. మహిళ సూసైడ్

image

అత్తింటివారి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నందవరంలో శనివారం జరిగింది. ఎస్సై శ్రీనివాసులు కథనం.. నందవరానికి చెందిన ఆశీర్వదమ్మ (26)కు అదే ప్రాంతంలోని మద్దన్నతో మూడేళ్ల క్రితం వివాహమైంది. కాగా పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త కుటుంబీకులు వేధించేవారు. దీంతో వేధింపులు తాళలేక ఇంట్లోనే ఉరి వేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 2, 2025

రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యం: లోకేష్

image

రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శనివారం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాల్లో మంత్రి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వలసల అధికంగా కొనసాగుతున్నాయని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

News March 1, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న నారా లోకేశ్➤ ఇంటర్ పరీక్షలు.. తొలిరోజు 611 మంది విద్యార్థుల గైర్హాజరు➤ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వాలని లోకేష్‌కు వినతి ➤ కడిమెట్లలో జిల్లా కలెక్టర్ పర్యటన➤ రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యం: లోకేశ్ ➤ ఆదోని: వైసీపీని వీడిన 75 కుటుంబాలు➤ లోకేష్ పర్యటనలో ఆసక్తికర ఘటన