India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శనివారం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాల్లో మంత్రి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వలసల అధికంగా కొనసాగుతున్నాయని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఎమ్మిగనూరు మండలం కడిమెట్లలో జరుగుతున్న భూ రీసర్వేను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శనివారం పరిశీలించారు. ఎమ్మార్వో శేషఫణితో కలిసి రీ సర్వేలో రైతుల నుంచి వస్తున్న సమస్యలను తెలుసుకున్నారు. మండలంలో నెలకొన్న భూ, తదితర సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 611 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23,755 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 23,144 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆయన వివరించారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 8.30 నుంచి చెక్ చేసి లోపలికి అనుమతించారు. ఇవాళ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతోంది. కర్నూల్ నగర వ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో సైన్స్ దినోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ హైస్కూల్‌లో శుక్రవారం సాయంత్రం ఓ భారీ వృక్షం కూలి విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థినులు గాయపడ్డారు. వారికి స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై ఎంపీడీవో రాణెమ్మ ఆరా తీశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 69 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 23,098 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 950 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST
మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా చీఫ్ సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సి.ఎస్.లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు.
➤ టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్➤ అశేష జనవాహిని నడుమ సిద్ధరుఢ స్వామి రథోత్సవం➤మంత్రాలయం శ్రీ మఠంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి➤ రేపు మంత్రాలయానికి మంత్రి నారా లోకేశ్ రాక➤ ఎమ్మెల్యేపై వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఫైర్➤ దేవనకొండ: తాను చదువుకున్న పాఠశాలకు రిటైర్డ్ ఐపీఎస్ విరాళం➤ పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తాం: కర్నూల్ కలెక్టర్
మంత్రి నారా లోకేశ్ రేపు మంత్రాలయం రానున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఆయన వస్తుండటంతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంగణం, గెస్ట్ హౌస్, ఆలయ ప్రాంగణాన్ని ఎస్పీ పరిశీలించారు. లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
కర్నూలు జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (DIEPC) సమావేశం జరిగింది. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రతిపాదనలను రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.