Kurnool

News February 1, 2026

ఎంఆర్పీఎస్ నేత హత్యపై ఖండించిన ఎంపీ నాగరాజు

image

తుగ్గలి మండలం బొందిమడుగులో ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ హత్యను ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆయన.. ఘటనపై పోలీసు అధికారులతో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రమేశ్ హత్య బాధాకరమని పేర్కొన్నారు. హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులను ప్రభుత్వం ప్రోత్సాహించదన్నారు. నిందితులు ఎవరైనా చట్టపరంగా శిక్షించాలన్నారు.

News February 1, 2026

ఆదోని మున్సిపాలిటీలో హాట్ టాపిక్

image

ఆదోని మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని అధికారులు, నాయకుల మధ్య రాజకీయ వేడి రగులుతోంది. చైర్ పర్సన్ లోకేశ్వరి బంధువులకు రూ.1.25 కోట్లతో బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ పనులను ఇవ్వడంపై చర్చ మొదలైంది. మున్సిపాలిటీ యాక్ట్ 1965 ప్రకారం ఛైర్మన్ బంధువులకు పనులు ఇవ్వడం చట్ట విరుద్ధం. దీనిపై ఆ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, రీజినల్ జాయింట్ డైరెక్టర్ విచారణ చేస్తే విషయాలు బయటకు వస్తాయి.

News January 31, 2026

ఇంటర్ ప్రాక్టికల్స్.. సర్వం సిద్ధం: ఆర్ఐవో

image

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జరగబోయే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆర్ఐవో లాలప్ప శనివారం ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థుల కోసం 64 పరీక్షా కేంద్రాలను మొదటి విడతగా ఎంపిక చేశామన్నారు. ఒకేషనల్ విద్యార్థుల కోసం 17 పరీక్షా కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీవీఈవో, డీఈసీలు స్క్వాడ్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

News January 31, 2026

ఎమ్మిగనూరుకు సీఎం చంద్రబాబు!

image

సీఎం చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 3 లేదా 8వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో పర్యటించనున్నట్లు జేసీ నూరుల్ క్వామర్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన హెలిప్యాడ్, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. సీఎంఓ నుంచి పర్యటన తేదీపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను సీఎం పంపిణీ చేయనున్నారు.

News January 31, 2026

కర్నూలులో 2న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

ఫిబ్రవరి 2న ఉ.9:30 గంటలకు కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News January 31, 2026

దాడిలో గాయపడిన రమేశ్ మాదిగ మృతి

image

తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన రమేశ్ మాదిగ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నిందితులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

News January 31, 2026

బాలికల పాఠశాలల్లో 100% టాయిలెట్ సదుపాయం: కలెక్టర్

image

ఆస్పిరేషనల్ బ్లాక్స్‌లో ఉన్న చిప్పగిరి, మద్దికెర, హోళగుంద మండలాల బాలికల పాఠశాలల్లో మార్చి 15 నాటికి 100 శాతం టాయిలెట్ సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. హోళగుంద ZP హైస్కూల్‌లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో అదనంగా 30 టాయిలెట్లు తక్షణమే నిర్మించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మరుగుదొడ్లు, తాగునీరు, పోషకాహారం వంటి వసతులు నిర్మించాలన్నారు.