Kurnool

News January 29, 2026

డీసీసీబీ సేవలపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో గురువారం కేడీసీసీ బ్యాంక్ జిల్లా స్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రైతులకు అందుతున్న రుణాలు, పథకాల అమలు, రికవరీ స్థితిగతులపై చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు సకాలంలో అందేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. బ్యాంక్ సేవల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News January 29, 2026

కర్నూలు కలెక్టరేట్ నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీ

image

హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి ఆమె అవగాహన ర్యాలీని ప్రారంభించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజ్ విహార్ సెంటర్ వరకు కొనసాగి ముగిసింది. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తేవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు.

News January 28, 2026

రెండో రోజు కొనసాగిన ఇంటర్ ప్రాక్టికల్స్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2వ రోజు ఇంటర్మీడియట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగాయి. పరీక్షల వివరాలను బుధవారం ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 1,313 మందికి గాను 1,239 మంది హాజరవ్వగా.. 74 మంది గైర్హాజరయ్యారన్నారు. ద్వితీయ సంవత్సరంలో 1,081 మందికి గాను 1,064 మంది పరీక్ష రాశారని, 17 మంది హాజరు కాలేదని పేర్కొన్నారు.

News January 28, 2026

100 రోజుల కార్యాచరణ అమలు కావాల్సిందే: కలెక్టర్

image

100 రోజుల కార్యాచరణ తప్పనిసరిగా ప్రతీ పాఠశాలలో జరగాల్సిందేనని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. బుధవారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదోని డివిజన్ ఎంఈఓలు, హెచ్ఎంలతో 10వ తరగతికి సంబంధించిన 100 రోజుల కార్యాచరణ అమలుపై డివిజన్ స్థాయి సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల ప్రత్యేక అధికారులు విద్యార్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వారిని ప్రోత్సహించాలన్నారు.

News January 28, 2026

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

image

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆకాంక్షించారు. బుధవారం కోడుమూరు మండలం వర్కూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో మౌలిక వసతులు, విద్యా బోధనను పరిశీలించిన కలెక్టర్, పరీక్షల సంసిద్ధతపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మంచి దస్తూరి (హ్యాండ్ రైటింగ్) అలవరుచుకోవాలని సూచిస్తూ వారిలో స్ఫూర్తి నింపారు.

News January 28, 2026

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు పెద్దతుంబలం విద్యార్థిని

image

ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన శ్రీలత ఖోఖోలో జాతీయ స్థాయికి ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. పెద్దతుంబలంలో 7వ తరగతి చదువుతున్న ఆమె.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబర్చింది. దీంతో ఆంధ్ర టీం తరఫున జాతీయ పోటీల్లో పాల్గొననుంది. ఈనెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో జరిగే పోటీల్లో పాల్గొననుంది.