Kurnool

News January 31, 2026

బాలికల పాఠశాలల్లో 100% టాయిలెట్ సదుపాయం: కలెక్టర్

image

ఆస్పిరేషనల్ బ్లాక్స్‌లో ఉన్న చిప్పగిరి, మద్దికెర, హోళగుంద మండలాల బాలికల పాఠశాలల్లో మార్చి 15 నాటికి 100 శాతం టాయిలెట్ సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. హోళగుంద ZP హైస్కూల్‌లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో అదనంగా 30 టాయిలెట్లు తక్షణమే నిర్మించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మరుగుదొడ్లు, తాగునీరు, పోషకాహారం వంటి వసతులు నిర్మించాలన్నారు.

News January 30, 2026

ఎమ్మిగనూరులో విషాదం

image

ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యువరాజు (43) అనే చేనేత కార్మికుడు అప్పుల బాధ తట్టుకోలేక, ఇంట్లో ఎవరి లేని సమయంలో మగ్గానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య ఉషారాణి, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 30, 2026

9 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వండి: కలెక్టర్

image

సహకార బ్యాంకుల ద్వారా రైతులకు సులభంగా పంట రుణాలు అందించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి బ్యాంకు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కేడీసీసీ బ్యాంక్‌కు సంబంధించి జిల్లా స్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం సహాయక మహిళా బృందాలకు 9 శాతం వడ్డీ రేటుతో రుణాలు అందించాలన్నారు.

News January 30, 2026

కర్నూలు ఎస్పీ కీలక సూచనలు

image

బస్సు ప్రయాణాల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలు ధరించి నిర్లక్ష్యంగా ఉండొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. రద్దీని అదునుగా చూసుకుని దొంగలు ఆభరణాలు, బ్యాగులు అపహరిస్తున్నారని తెలిపారు. అపరిచితులను నమ్మవద్దని, తెలియని వారి నుంచి ఆహారం తీసుకోవద్దని సూచించారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News January 29, 2026

జనాభా లెక్కల-2027పై అవగాహన పెంచాలి: సీఎస్

image

రాష్ట్రంలో జరగనున్న జనాభా లెక్కల సేకరణ-2027పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. సెన్సస్ ప్రక్రియ సజావుగా జరిగేలా మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజల కోసం ప్రత్యేక ఐఈసీ ప్రచార సామగ్రి సిద్ధం చేసి జిల్లాలకు పంపాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్‌కు సూచించారు.