Kurnool

News February 17, 2025

కర్నూల్‌లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత

image

కర్నూలులో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో ఇంత ఉష్ణోగ్రత నమోదవడం ఇది రెండోసారి. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

News February 17, 2025

కర్నూలు: మద్యం మత్తులో తండ్రిని చంపాడు

image

మద్యం మత్తులో తండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో ఆదివారం జరిగింది. నన్నూరుకు చెందిన నారాయణ, అతడి పెద్దకొడుకు నవీన్ ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత మద్యం మత్తులో గొడవకు దిగారు. మాటామాటా పెరిగడంతో నవీన్ కోపంతో కర్రతో నారాయణ తలపై కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు.

News February 16, 2025

తుగ్గలి: ఒకటే చెట్టు.. రెండు విభిన్నతలు

image

తుగ్గలి మండలం రాతన ఆశ్రమ పాఠశాల సమీపంలోని ఓ చింత చెట్టు చూపరులను ఆకర్షిస్తోంది. చెట్టు ఓ వైపు ఆకులు ఎండిపోయి కనిపిస్తుంటే, మరో వైపు పచ్చని ఆకులతో కళకళలాడుతోంది. రెండు వర్ణాలతో దర్శనమిస్తున్న చెట్టు ఆ మార్గం గుండా వెళ్లే చూపరులను, వాహనదారులను, రైతులను ఆకట్టుకుంటోంది.

News February 16, 2025

నంద్యాల జిల్లాలో నవజాత శిశువు లభ్యం

image

సిరివెళ్ల మండలం జునెపల్లె ఎస్సీ కాలనీలో నవజాత శిశువు లభ్యం అయ్యింది. ఆదివారం తెల్లవారుజామున గ్రామంలోని ఓ వ్యక్తి కూలీలను పనికి పిలుస్తుండగా ఖాళీ స్థలం నుంచి శిశువు ఏడుపును గమనించాడు. అక్కడికి వెళ్లి చూడగా ఆడ శిశువుగా గుర్తించాడు. 108 వాహనానికి ఫోన్ చేయగా వారు వైద్యం నిమిత్తం శిశువును తీసుకెళ్లారు. అధికారులు విచారణ చేపట్టారు.

News February 16, 2025

కర్నూలు, ఆదోనిలో ఎండు మిర్చి ధరల వివరాలు

image

కర్నూలు, ఆదోని వ్యవసాయ మార్కెట్లలో శనివారం ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటా గరిష్ఠ ధర రూ.13,236 పలకగా.. కనిష్ఠ ధర రూ.2,200 పలికింది. కర్నూల్లో కనిష్ఠంగా రూ.3,500 పలకగా.. గరిష్టంగా రూ.12,813 పలికినట్లు ఆయా మార్కెట్ల ఎంపిక శ్రేణి అధికారులు తెలిపారు.

News February 16, 2025

ఆదోని: ‘రూ.లక్ష విలువ చేసే ఐఫోన్ పోలీసులకు ఇచ్చాడు’

image

ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన కరీమ్ అనే యువకుడు రూ.లక్ష విలువ చేసే ఐఫోన్‌ను శుక్రవారం రాత్రి ఆదోని నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా పడేసుకున్నాడు. దొడ్డనగేరీకి వెళ్లే రహదారిలో చింతకాయల రమేశ్ అనే యువకునికి ఉదయం పొలానికి వెళ్తుండగా దొరికింది. వెంటనే స్థానిక వన్ టౌన్ సీఐ శ్రీరామ్‌కు అందజేసి, బాధితుడికి ఆయన ఆధ్వర్యంలో అందజేశారు. రమేశ్‌ను పోలీసులు అభినందించారు.

News February 16, 2025

రీ సర్వే విధానాన్ని పరిశీలించిన కలెక్టర్

image

గోనెగండ్లలో జరుగుతున్న రీసర్వే పనులనుకలెక్టర్ రంజిత్ భాష శనివారం పరిశీలించారు. అధికారులు చేపడుతున్న రీసర్వే విధానాన్ని, తహశీల్దార్ కుమారస్వామిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి అపోహలు లేకుండా రీసర్వే కొనసాగించాలన్నారు. రైతులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా సర్వే పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.

News February 16, 2025

కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కర్నూలులోని కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పది, ఇంటర్, డిగ్రీ, కోర్సుల్లో అర్హత సాధించిన వారు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News February 15, 2025

కర్నూలులో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

కర్నూలు మెడికల్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అందిన వివరాల మేరకు.. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న రమ్యతేజ అనే విద్యార్థిని హాస్టల్‌లో పురుగు మందు తాగారు. గమనించిన సిబ్బంది వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రమ్యతేజ అనంతపురానికి చెందిన యువతిగా తెలుస్తోంది. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.

News February 15, 2025

కర్నూలు మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు

image

ఏపీ టూరిజం ఆధ్వర్యంలో యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఈనెల 17న తిరుపతి, ఒంటిమిట్ట, ఓర్వకల్లు, కర్నూలు, హైదరాబాద్, బాసర, వారణాశి మీదుగా ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటుంది. తిరిగి జబల్‌పూర్, హైదరాబాద్, కర్నూలు, మహానంది మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఈ బస్సు 17న మ.2.15 గంటలకు కర్నూలుకు వస్తుంది. టికెట్ ధర రూ.20వేలు, పిల్లలకు రూ.17, 200లుగా నిర్ణయించారు.