India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల జిల్లా నరసాపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీలచ్చమ్మ (36) మృతి చెందారు. గ్రామస్థుల వివరాల మేరకు.. సోమవారం ఓంకారం క్షేత్రానికి వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆమె కిందపడ్డారు. ఈ ఘటనలో లచ్చమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కోడలు ఏసమ్మక తీవ్రంగా గాయపడింది. ఏఎస్ఐ రాంభూపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
సోమవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గుంతలరహిత రోడ్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రలో జరుగుతున్న గుంతల రోడ్ల నిర్మాణ పనుల గురించి మంత్రి సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్&బి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన విద్యార్థి డి.సిద్ధి భాష(13) సోమవారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కొలిమిగుండ్ల పోలీసుల వివరాల మేరకు.. సిద్ధి భాష హెయిర్ కటింగ్ విషయంలో అతడి పెద్దమ్మ మందలించింది. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రులు అతని చిన్నప్పుడే చనిపోయారు.
శ్రీశైలంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లికి చెందిన మల్లికార్జున(56) అనే భక్తుడు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. మల్లన్న దర్శనానికి వచ్చిన ఆయన కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పిస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తోటి భక్తులు తెలిపారు. దేవస్థానం అధికారులు, పోలీసులు పరిశీలించి, మృతుడి బంధువులకు సమాచారం అందించారు.
ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్కు ద్వారా 5 వేల నుంచి 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనున్నామని మంత్రి సవిత తెలిపారు. ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కుకు కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఆదివారం ఆమె పరిశీలించారు. స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి కల నెరవేరబోతోందని అన్నారు. గడిచిన ఐదేళ్లలో చేనేత కార్మికులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు.
భర్తను భార్య చంపిన ఘటన ఆదివారం కర్నూలులో జరిగింది. కర్నూలు తాలూకా సీఐ శ్రీధర్ మాట్లాడుతూ.. టీవీ9 కాలనీకి చెందిన కరగల్ల చిన్న(25), తన భార్య స్వరూపారాణి రోజూ గొడవపడేవారు. ఆదివారం కూడా గొడవ జరగడంతో ఆగ్రహించిన భార్య ఇనుప రాడ్డుతో భర్త తలపై కొట్టింది. బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి పద్మావతి ఫిర్యాదు మేరకు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు.
ఏపీ సివిల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జాయింట్ సెక్రటరీగా కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన స్పెషల్ జనరల్ బాడీ సమావేశంలో ఏపీ సివిల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించి కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో కమిటీ జాయింట్ సెక్రటరీగా రంజిత్ బాషా ఎన్నికయ్యారు.
కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జిల్లా కోర్ట్ కానిస్టేబుళ్లతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 14న జరిగే లోక్ ఆదాలత్‌లో అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. న్యాయశాఖ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కర్నూలు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్, రెవెన్యూ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సునయన ఆడిటోరియంలో నేరుగా బాధితులు వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చు అన్నారు.
ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తా పడి బళ్లారికి చెందిన మహంకాళమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. తారపురం ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.