Nellore

News July 21, 2024

నెల్లూరు: ఫోర్జరీ కేసులో విచారణ షురూ

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ కేసులో దర్గామిట్ట పోలీసులు విచారణ చేపట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన డి.హరిత, వికాస్ మరమ్మత్ సంతకాలను కొందరు ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. వికాస్ మరమత్ ఫిర్యాదు మేరకు నగర మేయర్ భర్త పి.జయవర్ధన్, ఆయన అసిస్టెంట్ శివకృష్ణ, కార్తీక్ మాలవ్య, స్ట్రక్చరల్ ఇంజినీర్ అండ్ లైసెన్స్డ్ దిలీప్ కమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 21, 2024

నెల్లూరు: అత్యధిక వర్షపాతం సీతారాంపురం, అత్యల్పం బోగోలు

image

జిల్లాలో రెండు రోజులుగా ఓ మోస్తరుగా వర్షం కురుస్తుంది. శనివారం జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా సీతారాంపురం మండలంలో 40.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అదేవిధంగా ఉదయగిరిలో 18.0, దుత్తలూరులో 17.6, కందుకూరులో 16.8, కొండాపురంలో 12.3, కావలిలో 9.6, సంగంలో 9.0, మర్రిపాడులో 7.8, నెల్లూరు రూరల్‌ 7.4, బోగోలులో 7.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయ్యింది.

News July 21, 2024

నెల్లూరులో ఈ నెల 23న జాబ్ మేళా

image

నగరంలోని ఉపాధి కార్యాలయంలో ఈనెల 23వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వినయ్ కుమార్ తెలిపారు. మహాలక్ష్మిపురం శరత్ ఇండస్ట్రీలో ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ విభాగంలో పనిచేయటానికి ఐటిఐ, డిప్లోమో, బీటెక్ చదివిన విద్యార్థులు ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 21, 2024

హైకోర్టులో విజయసాయి రెడ్డి కుమార్తెకు ఊరట

image

విశాఖ జిల్లా భీమిలి వద్ద MP విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మించిన ప్రహరీ కూల్చి వేయాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై మరొకరు వేసిన పిల్ విచారణకు రావడంతో.. దాంతో నేహారెడ్డి పిటిషన్ జత చేయాలని కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు వద్దని అధికారులకు సూచించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రహరీ నిర్మించారని సమాచారం.

News July 21, 2024

కావలి: వందే భారత్‌పై రాళ్లతో దాడి

image

కావలి పట్టణం జనతా పేట ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్న పలు రైళ్లపై ఆకతాయిలు రాళ్లు రువ్వారు. వందే భారత్ రైలుపై రాళ్లు పడటంతో అద్దం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఐదుగురు మైనర్లను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మరోమారు ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 20, 2024

నెల్లూరు నగర కమిషనర్‌గా మల్లవరపు సూర్యతేజ

image

నెల్లూరు నగర కమిషనర్‌గా మల్లవరపు సూర్యతేజ నియమితులయ్యారు. ఏపీలో భారీగా IAS అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మల్లవరపు సూర్యతేజ నెల్లూరు కమిషనర్‌గా బదిలీ అయ్యారు.

News July 20, 2024

నెల్లూరు: TODAY 6PM TOP NEWS

image

-గూడూరులో అత్యాచారం నిందితుడి అరెస్ట్
-నెల్లూరు: ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు
-నెల్లూరు: పెట్రోల్ బంకులపై వాహనదారుల ఆగ్రహం
-సోమిరెడ్డికి ముడుపులు చెల్లిస్తేనే అనుమతులు: కాకాణి
-ఎంపీ విజయసాయి రెడ్డితో చంద్రశేఖర్ రెడ్డి భేటీ

News July 20, 2024

ఎంపీ విజయసాయి రెడ్డితో చంద్రశేఖర్ రెడ్డి భేటీ

image

ఢిల్లీలో చేపట్టబోయే దీక్షకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎంపీ విజయసాయి రెడ్డితో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యను నిరసిస్తూ ఈ నెల 24 వ తేదీ ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నారు.

News July 20, 2024

నెల్లూరు: పెట్రోల్ బంకులపై వాహనదారుల ఆగ్రహం

image

జిల్లాలోని పలు పెట్రోల్ బంకులలో గాలి మిషన్లు పని చేయడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 189 పెట్రోల్ బంకులు ఉండగా ప్రతి రోజూ 7 లక్షల లీటర్ల డీజిల్, 4 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతోంది. నిబంధనల మేరకు ప్రతి బంకులో గాలి మిషన్ ఏర్పాటు చేయాలి. కొన్ని చోట్ల గాలి మిషన్లు లేవని, మరికొన్ని చోట్ల పని చేయడం లేదన్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు వాహన దారులు వాపోయారు.

News July 20, 2024

నెల్లూరు: ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు

image

అగ్నివీర్ వాయు పథకంలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి వినయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అభ్యర్థులు 21 ఏళ్లలోపు వయసు ఉండి, కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ డిప్లొమాతో సమానమైన విద్యార్హత కలిగి పెళ్లి కాని యువత అర్హులని తెలిపారు. ఈ నెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.