Nellore

News April 14, 2026

రేపే రిజల్ట్స్.. నెల్లూరు జిల్లాలో 53,404 మంది వెయిటింగ్

image

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో రెగ్యులర్, ఒకేషనల్ కలిపి 26,935 మంది, ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్, ఒకేషనల్ కలిపి 26,469 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

నెల్లూరు రూరల్లో ఫైర్ ఆఫీస్.. కావలికి ఒక వెహికల్..?

image

ప్రస్తుతం ఎండలు 40 డిగ్రీలు దాటుతోంది. అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జిల్లాలో నెల్లూరు రూరల్లో ఒక ఫైర్ ఆఫీస్, కావలి విస్తీర్ణం పరంగా మరొక వెహికల్ అవసరంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. 2020 నుంచి 2026 వరకు 4107 ప్రమాదాలు జరిగాయి. రూ.95.54 కోట్ల మేరా ఆస్తి నష్టం వాటిల్లగా 190 మంది మృతి చెందారు. జంతువులు, పక్షులు 55 వరకు మృత్యువాత పడ్డారు. మరోవైపు ఫైర్ సిబ్బంది, పరికరాల కొరత వేధిస్తుంది.

నెల్లూరు: జగన్ పర్యటనకు వెళ్తే రూ.లక్ష జరిమానా!

image

నెల్లూరు జిల్లాలో రాజకీయ సెగ రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇస్కపల్లి పట్టపుపాళెం గ్రామస్థులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమ దీర్ఘకాలిక సమస్య అయిన బోట్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఏ రాజకీయ నాయకుడిని కలవకూడదని, పార్టీల మీటింగ్‌లకు వెళ్లకూడదని గ్రామ పెద్దలు ‘దూరాయ్’ ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా జగన్ పర్యటనకు వెళ్తే వారికి రూ.లక్ష జరిమానా విధిస్తామన్నారు.

News April 14, 2026

నెల్లూరు: వడదెబ్బతో వ్యక్తి మృతి

image

ఉదయగిరిలోని దాసరపల్లిలో వడదెబ్బ తగిలి షేక్. మౌలాలి (65) మృతి చెందాడు. పొలానికి నీళ్లు కట్టడానికి 10 గంటల సమయంలో వెళ్లిన మౌలాలి పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. కొద్దిసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యాధికారులు వెల్లడించారు.

News April 14, 2026

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన నెల్లూరు కలెక్టర్

image

అంబేడ్కర్ జయంతి సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశానికి భారత రాజ్యాంగాన్ని ఒక దిక్సూచిగా రచించిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన దేశానికి అందించిన రాజ్యాంగం నేటికీ కొనసాగించడం అభినందనీయమన్నారు.

News April 14, 2026

ఆత్మకూరు: ఆటోలోనే డ్రైవర్ మృతి

image

ఆత్మకూరు శివారులోని నెల్లూరు పాలెం వద్ద సోమవారం ఆటోలోనే డ్రైవర్ జమీర్(57) మృతి చెందారు. టిట్కో గృహాల్లో నివసించే ఆయన ఉదయం ఇంటి నుంచి వెళ్లిన తర్వాత నెల్లూరు పాలెం వద్ద ఆటోలోనే విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అనారోగ్యం లేదా ఎండ తీవ్రత వల్ల మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2026

నెల్లూరు: బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం.!

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలు టీ. దుర్గకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉద్యోగం కల్పించిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమెకు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ, జీవనోపాధి కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.