Nellore

News October 18, 2025

రూ.1కే సిమ్.. రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా

image

BSNL కొత్త వినియోగదారులకు దీపావళి సందర్భంగా కానుక ప్రకటించినట్లు నెల్లూరు జిల్లా జనరల్ మేనేజర్ అమరేందర్ రెడ్డి తెలిపారు. ఈ ప్యాకేజీలో రూ.1కే సిమ్ అందిస్తూ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ సిమ్ కోసం ఆధార్ ధ్రువీకరణతో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం కానీ ఏజెంట్ల ద్వారా ఈ అవకాశం నవంబర్ 15 వరకు పొందవచ్చు అన్నారు.

News October 18, 2025

పవన్ కళ్యాణ్ వద్దకు చేరిన నెల్లూరు పంచాయితీ

image

జిల్లా పర్యవేక్షకులు అజయ్ కుమార్ తీరుపై జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పలు విమర్శలు చేశారు. దీంతో డైరెక్ట్‌గా DCM పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి రావాలని సందేశాలు పంపారు. దీంతో నెల్లూరు జిల్లాలో రెండు రోజుల క్రితం తిరుగుబాటు జెండా ఎగురవేసిన జనసేన నేతలందరూ శుక్రవారం విజయవాడ బయలుదేరారు.

News October 17, 2025

నెల్లూరులో ఆక్రమణలపై కొరడా..!

image

ఇటీవల NMC అధికారులు రోడ్డు మార్జిన్లపై కొరాడ జలిపిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరులో సైడు కాలువలపై ఆక్రమణలు పెరిగిపోయాయి. ప్రధాన ట్రంకురోడ్డు, పొదలకూరు రోడ్డు, రంగనాయకులపేట, సంతపేట, గాంధీ బొమ్మ, కనకమహాల్ ఇలా ప్రధానమైన చోట్ల కాలువలను ఆక్రమించేశారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేషన్ ఆక్రమనలను తొలగిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్లా అక్రమణలను ధ్వంసం చేస్తున్నారు.

News October 17, 2025

రైతులకు యూనిక్ నంబర్లు తప్పనిసరి: సత్యవతి

image

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ పథక లబ్ధి చేకూరాలంటే యూనిక్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ సత్యవతి తెలిపారు. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇనాక్టివ్, రిజెక్ట్ అయిన రైతుల వివరాలను సంబంధిత హోం పేజీలో పొందుపరిచి సరిచేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.

News October 17, 2025

పంపకాల్లో తేడాలతోనే విమర్శలు: కాకాణి

image

రేషన్ అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే TDP నేతలు పరస్పం విమర్శలు చేసుకుంటున్నారని వైసీపీ నేత కాకాణి అన్నారు. నకిలీ మద్యం, రేషన్ ఇలా రోజుకొక అవినీతి కూటమి ప్రభుత్వంలో బయటపడుతుందన్నారు. దీని వెనుక TDP నేతలు ఉన్నారని Dy.CM పవన్, మంత్రి నాదెండ్ల దీనిపై విచారణ చేయాలని కాకాణి డిమాండ్ చేశారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు తరలిస్తున్నారని ఆయన ఆరరోపించారు.

News October 17, 2025

నెల్లూరు: ఎందుకీ నిర్లక్ష్యం..!

image

నెల్లూరు జిల్లాలో PM కిసాన్ నిధుల పంపిణీ ఆలస్యం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల మంది రైతులకు రూ.253.79 కోట్లను ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. గతేడాది వరకు 1.67 లక్షల మంది ఖాతాల్లో 3 విడతల్లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే జమైంది. మరో రూ.150 కోట్లు జమవ్వాల్సి ఉంది. ఈకేవైసీ, బ్యాంక్ లింకేజీ, ఫిజికల్ రీ వెరిఫికేషన్ చేయకపోవడంతో దాదాపు 7 వేల మంది ఈ నిధులకు దూరంగా ఉన్నారు.

News October 17, 2025

Way2News కథనం.. విద్యార్థి ఆచూకీ లభ్యం

image

ఉదయగిరి(M) అన్నంపల్లి విద్యార్థి యోగీశ్వర్ ఆచూకీ లభ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. <<18019708>>విద్యార్థి మిస్సింగ్<<>> అంటూ Way2Newsలో కథనం వచ్చిన విషయం తెలిసిందే. విద్యార్థి తిరుపతిలో ఉండగా ఓ వ్యక్తి గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వెంటనే తిరుపతికి వెళ్లి విద్యార్థిని కలిశారు. Way2Newsలో వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ బిడ్డను తిరుపతిలో వ్యక్తి గుర్తించి సమాచారం ఇచ్చారని వారు తెలిపారు.

News October 16, 2025

పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ : కలెక్టర్

image

ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫారం 6 లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారం 6 లను సంపూర్ణంగా పూర్తిచేసే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు నూతన ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు.

News October 16, 2025

కావలి : పట్టపగలే ఇంట్లో దొంగతనం

image

కావలిలోని వడ్డెపాలెం రైల్వే క్వార్టర్స్ నందు రైల్వే ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న శైలజ ఇంట్లో మధ్యాహ్నం దొంగతనం జరిగింది. వారి బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లి ఇంటికి రాగ ఇంటి వెనుక నుంచి తలుపులు బద్దలు కొట్టి ఇంటిని దోచుకున్నారు. రూ.30 వేల నగదు, 3 బంగారు ఉంగరాలు, వెండి మొలతాడు కనిపించట్లేదన్నారు. స్థానిక ఒకటవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 16, 2025

నెల్లూరు: బస్టాండ్ ఓ చోట.. బస్సులు ఆపేది మరోచోట

image

నిత్యం రద్దీగా ఉండే నెల్లూరు RTC బస్టాండ్ ఎదురుగా ఆటోలు, ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా ఆపేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు సర్వోదయ కాలేజీని అనుకుని యూనియన్ బ్యాంక్ వద్ద బస్టాండ్‌ని ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రం వాహనాలు నిలపకుండా..కాలేజ్ ఎదురుగా ఆపేస్తున్నారు. ఫలితంగా బస్టాండ్ కట్టినా ప్రయోజనం ఉండడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.