India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం తాగేడు సమీపంలోని బాలచంద్ర రెడ్డి భవనం దగ్గర వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈక్రమంలో ఇద్దరు యువకులు బైకుపై మల్లాం వైపు వెళ్లేందుకు వాగు దాటేందుకు ప్రయత్నించారు. బైకుతో సహా ఇద్దరు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరుకు చెందిన మధు రెడ్డి, ఒడిశాకు చెందిన షారుక్ కొట్టుకెళ్లినట్లు స్థానికులు గుర్తించారు.

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజి నుంచి దిగువకి ఐదు వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ముందుగా పెన్నా పరివాహక ప్రాంతాలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఆయా గ్రామాలలో అధికారులు దండోరా వేయించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. చేపలు పట్టే వారు, పశువుల కాపరులు ఎవరూ పెన్నానది వద్దకు వెళ్లకూడదని తహశీల్దార్ సోమ్లా నాయక్, సీఐ వేమారెడ్డి హెచ్చరికలు జారీచేశారు.

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట షార్ నుంచి ఈనెల 4వ తేదీన పీఎస్ఎల్వీ సీ – 59రాకెట్ ను ప్రయోగించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.38గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించనున్నట్లు శాస్రతవేత్తలు తెలియజేశారు. కౌంట్ డౌన్ కొనసాగిన తరువాత 4వ తేదీన సాయంత్రం 4.08 గంటలకు ప్రయోగించనున్నారు. సోమవారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించారు. మొదటి ప్రయోగ వేదికలో అనుసంధాన పనులు జరుగుతున్నాయి.

ఉమ్మడి నెల్లూరు జిల్లా,సూళ్లూరుపేటలో రేపు ఉదయం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన హాజరై ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

కొండాపురం మండలం గానుగపెంటలో బంకా తిరుపాలు అనే మేకల కాపరిని హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ శ్రీధర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. గానుగపెంటలో బుధవారం బాంకా తిరుపాలు హత్యకు గురయ్యాడు. పశువులు కాస్తున్న మాల్యాద్రి(మల్లి) ఈ హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. తిరుపాలుకు చెందిన మేకలను అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని ఆశతోనే ఈ హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

నెల్లూరు జిల్లాలో భారీవర్షాల నేపథ్యంలో పలు బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు రీజియన్ పరిధిలో ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు నుంచి చెన్నైకు ప్రతి రోజూ 18 బస్సులు నడుస్తుండగా వాటిని రద్దు చేశామన్నారు. మరోవైపు కావలి నుంచి తుమ్ములపెంట దారిలో కాలువకు గండి పడటంతో ఆ దారిలో వెళ్లే బస్సులను సైతం రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

నెల్లూరు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ ఆదేశాలు జారీ చేశారు. విపత్తు సహాయక బృందాలు తక్షణమే విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని వరద బాధితులు తమ సమస్యలను 9494018118 నంబరుకు వాట్సప్ ద్వారా లేదా 0861-2356777 & 0861-2316777 నంబర్లను సంప్రదించాలన్నారు.

‘ఫెంగల్’ తుఫాను ప్రభావంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటి వివరాలు: సాయంత్రం 4.30కు రావాల్సిన విజయవాడ వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 7 గంటలకు వచ్చింది. అలానే సర్కార్ ఎక్స్‌ప్రెస్, చార్మినార్ ఎక్స్‌ప్రెస్, జి.టి ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

పెన్నానదికి భారీగా వరద పోటెత్తే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఆదివారం రాత్రి వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పెన్నానదికి వరదలు సంభవించవచ్చని జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పెన్నానది పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. కృష్ణపట్నం పోర్టుకు 6వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరుకు శనివారం ఉదయం రానున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్లో పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సభ్యత నమోదు కార్యక్రమం పై డివిజన్ సంబంధించిన ప్రెసిడెంట్లతో ప్రధానంగా చర్చించుచున్నారని ఆయన కార్యాలయం నుంచి ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు, నాయకులు అందుబాటులో ఉండాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.