India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉదయగిరి మండలం శకునాలపల్లి గ్రామంలోని ఓ బావిలో పడిన మేకను రక్షించబోయి యజమాని ప్రాణాల కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఈర్ల వెంకటయ్య (75) తన మేకలు, గొర్రెలను మేత కోసం అడవిలోకి తీసుకువెళ్లాడు. ఆ క్రమంలో ఓ మేక వ్యవసాయ బావిలో పడింది. దానిని రక్షించే క్రమంలో బావిలో ఉన్న తామర తుట్టేల్లో చిక్కుకుపోయి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆత్మకూరు నుంచి ఆనం, నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గతంలో ఆనం ఆర్థిక మంత్రిగా, నారాయణ పురపాలక శాఖమంత్రిగా చేశారు. ఇప్పుడు వారికి సీఎం చంద్రబాబు ఏ శాఖలు కేటాయిస్తారన్నది జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. వారికి ఏ శాఖలు దక్కుతాయో కామెంట్ చేయండి.
సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపి బంగారు గొలుసులు, బ్యాగులను దోచుకున్న ఘటన శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలును ఆపి గుడివాడకు చెందిన వి.నిర్మల మెడలోని బంగారు గొలుసును, పద్మకు చెందిన బ్యాగును ఎత్తుకెళ్లారు. అదేవిధంగా తిరుపతి స్పెషల్ రైలులో ప్రయాణికుడు పాపారావుపై దాడి చేసి అతని భార్య మెడలోని బంగారు గొలుసును తెంపుకెళ్లారు.
ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆనం మొదటిసారి 1983లో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల్లో కేవీఎస్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1985లో రాపూరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొంది 1989లో దివంగత ఎన్టీఆర్ మంత్రివర్గంలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 35 ఏళ్ల తర్వాత రెండోసారి టీడీపీలో మంత్రిగా ఆనం ఎంపిక కావడం విశేషం.
నూతన రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణను మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పరసా రత్నం బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు
వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన 2019లో మంత్రులుగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డికి అవకాశం లభించింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ అ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకే అదృష్టం వరించింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణ, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం మండలం కేసరపల్లెలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణరెడ్డి గెలిచిన విషయం తెలిసిందే.
మంత్రిగా పొంగూరు నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం మండలం కేసరపల్లెలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గెలిచిన విషయం తెలిసిందే.
ఆనం రామనారాయణరెడ్డి ఆరోసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. 1983లో నెల్లూరు TDP అభ్యర్థిగా గెలిచి NTR మంత్రివర్గంలో పనిచేశారు. 1985లో రాపూరు నుంచి గెలిచి మరోసారి మంత్రి అయ్యారు. 1991లో కాంగ్రెస్‌లో చేరి 1999, 2004 రాపూరు నుంచి గెలిచారు. 2007లో, 2009లో YSR మంత్రివర్గంలో రెండుసార్లు పనిచేశారు. 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మంత్రిగా చేశారు. 2024లో చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
MSc, PhD చేసిన పొంగూరు నారాయణ నెల్లూరులోని VR కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్‌గా పనిచేశారు. అనంతరం 1979లో ఓ చిన్న అద్దె గదిలో ట్యూషన్ సెంటర్‌గా మొదలైన ఆ ప్రస్థానం అనతికాలంలోనే దేశమంతా విస్తరించింది. 1999లో వైద్యకళాశాలను నెల్లూరులో స్థాపించారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగానూ, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో 72వేల మెజార్టీతో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు.
Sorry, no posts matched your criteria.