India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కానిస్టేబుల్ ఉద్యోగానికి జరిగిన వివిధ పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ఉద్యోగాన్ని సాధించిన అభ్యర్థులందరికీ ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని SP కృష్ణ కాంత్ సూచించారు.
జిల్లాలో స్త్రీశక్తి పథకం ఆరంభించాక తొలి వారం 7,64,311 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షమీమ్ తెలిపారు. శనివారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభం కాగా, 22 వ తేదీ వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ వంటి మూడు రకాల బస్‌లలో మొత్తం 14,88,537 మంది ప్రయాణించారన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం తిమ్మనాయుడుపాళెం గ్రామానికి చెందిన కావలి సాయినాథ్ DSC పరీక్షలో ఒకేసారి 3 ఉద్యోగాలు సాధించాడు. PGT SOCIAL – 22nd rank, SA SOCIAL -23 RANK, TGT SOCIAL – 59th Rank సాధించి 3 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. సాయినాథ్‌ను పలువురు అభినందించారు.
గొలగమూడిలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమం భాగంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
గణేష్ చతుర్థి ఉత్సవాలకు జిల్లా పోలీసు శాఖ కీలక సూచనలు చేశారు. విగ్రహాలను రహదారులకు దూరంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని, తాత్కాలిక సీసీ కెమెరాలు పెట్టాలని, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. మండపాల వద్ద ఇసుక బస్తాలు, డ్రమ్ముల్లో నీరు, అగ్ని ప్రమాద నిరోధిక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే 112కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఇక నుంచి తాను ఎవరికీ పెరోల్ కోసం లేఖలు ఇవ్వనని MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. తాను, గూడూరు MLA సునీల్ ఇచ్చిన లేఖలను హోమ్ శాఖ తిరస్కరించిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య సైతం లేఖలు ఇచ్చారని వాటితోనే శ్రీకాంత్‌కు పెరోల్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్‌ను అధికారులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. భద్రతా కారణాలు దృష్ట్యా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఉదయం 6:30 సమయంలో విశాఖ జైలుకు అతను చేరుకున్నాడు. పెరోల్ రద్దు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతన్ని వేరే జైలుకు తరలిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అతన్ని విశాఖ తరలించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బార్ల పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో ఆథరైజ్డ్ బార్ల దరఖాస్తులకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఈనెల 18న జిల్లాలో బార్ల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలై ఇప్పటి వరకు ఐదు రోజులు కావస్తున్నా దరఖాస్తులు దాఖలు కాలేదు. నూతన బార్ల విధానం నిర్వహకులకు భారంగా మారుతుందని పలువురు వాపోయారు.
డీఎస్సీ-25కు సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మొద్దని నెల్లూరు DEO బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీల్లో పోస్టులు భర్తీ కొరకు కాల్ లెటర్ అందిన అభ్యర్థులు వ్యక్తిగతంగా సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌కు రావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు కుల ధ్రువీకరణ పత్రాలు మూడు సెట్లు జిరాక్స్, గెజిటెడ్ అటిస్ట్రేషన్తో పాటు 5 ఫోటోలు తీసుకురావాలని కోరారు.
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించని జిల్లాలోని 29 MEOలకు DEO బాలాజీ రావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఫేస్ రికగ్నైజ్ యాప్(FRS)లో హాజరు నమోదు చేసుకోవాలి. అయితే అందుకు భిన్నంగా వారు హాజరు నమోదు చేసుకోకపోవడంతో సంజాయిషీ కోరుతూ నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.