India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ నేతల దురాగతాలకు తాము భయపడమని మాజీ మంత్రి కాకాణి పేర్కొన్నారు. తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారన్న ఆయన.. YCP కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్‌పై ఆధారాలు లేకుండా కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులు ఆ దిశగా చొరవ చూపలేదని అసహనం వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు తాము భయపడమని, తాము తిరగబడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.
వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ టీచర్ వద్ద మహిళ భారీగా సొమ్ము దోచేసిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. నంద్యాలకు చెందిన కౌలస్య తనను వివాహం చేసుకుంటానని రూ.4.50 లక్షలు తీసుకొని మోసం చేసిందని వేదాయపాళెంకు చెందిన ఓ టీచర్ వాపోయాడు. ఈ మేరకు ఆయన సోమవారం నెల్లూరులో జరిగిన SP గ్రీవెన్స్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించి తనకు న్యాయం చేయాలని కోరారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 40,285.32 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 3336.72 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జేసీ వెల్లడించారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
నెల్లూరు జిల్లా ఎస్పీ యస్. కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు ఉమేశ్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏఎస్పీ సౌజన్య నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వివిధ సమస్యలపైన వినతులను అధికారులకి అందచేశారు. పరిష్కార వేదికకు మొత్తం 86 ఫిర్యాదులు వచ్చాయని ఏఎస్పీ తెలిపారు.
రాష్ట్రంలో 76 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని మూలాపేట వేణుగోపాలస్వామి దేవస్థానంలో ఆలయ పాలకమండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంశపారంపర్యంగా ఆలయ ధర్మకర్తలుగా పని చేస్తున్నామన్నారు. వేణుగోపాల స్వామి దేవాలయంలో పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అమరావతి కాంట్రాక్ట్‌ల్లో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 8 అనుకూల సంస్థలకే రూ.28,210 కోట్ల విలువైన పనులు అప్పగించారన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల నుంచి 8 శాతం కమీషన్లు పుచ్చుకున్నారన్నారు.
బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోటపల్లిగూడూరుకు చెందిన జానకి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడ బీఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అలాగే కార్యక్రమంలో జానకి ప్రసాద్‌కు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తి రుపతి, చిత్తూరు జిల్లాల ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. పార్టీ అభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తించినందుకు ఆయన పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు.
హనీట్రాప్‌కు గురై ఓ వ్యక్తి రూ.18 లక్షలు పోగొట్టుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వరికుంటపాడుకు చెందిన తనకు ఆన్లైన్ ద్వారా దుర్గాభవాని అనే మహిళ పరిచయమైందని, అనారోగ్యంగా ఉందని నమ్మించి తన దగ్గర రూ.18 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని వాపోయాడు. ఈ మేరకు సోమవారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశాడు.
ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతుందంటూ MLC చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు. 17 మంది వీసీలను బెదిరించి రాజీనామా చేయించడంపై ఆధారాలు ఇచ్చినా మంత్రి లోకేశ్ విచారణ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు రూ.5,252కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రజలు TDPని గెలిపించి బాధపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విషపూరితమైన ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. నాడు నేడు ద్వారా జగన్ 45 వేల పాఠశాలలను ఆధునీకరణ చేశారన్నారు. అలాంటి జగన్‌ను.. మంత్రి నారా లోకేశ్ పాఠశాలలను నిర్వీర్యం చేశారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కార్పొరేటర్‌లు, నేతలు పాల్గొన్నారు
Sorry, no posts matched your criteria.