Nellore

News November 25, 2024

MSMEలు ఏర్పాటులో నెల్లూరు జిల్లాకు మూడో స్థానం

image

గత ఆర్థిక సంవత్సరంలో సామాజిక అర్థిక సర్వే-2024 ప్రకారం MSMEలు ఏర్పాటు చేయడంలో నెల్లూరు జిల్లా మూడో స్థానంలో నిలిచింది. నెల్లూరు జిల్లాలో రూ.526.13 కోట్లతో 15,910 యూనిట్లు ఏర్పాటు చేశారని తెలిపింది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 968 యూనిట్లు ఏర్పాటు అయ్యాయి.

News November 25, 2024

నెల్లూరుకు భారీ వర్ష సూచన

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి శ్రీలంకకి దగ్గరగా కదులుతూ కేంద్రీకృతం అయ్యిందని Weatherman report తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు – తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే 28 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం బలపడి చెన్నైకి దగ్గరగా వస్తే దక్షిణ కోస్తాంధ్రలో అతిభారీ వర్షాలు కురుస్తాయంది.

News November 25, 2024

నెల్లూరు: ప్రియుడిని కిడ్నాప్ చేసిన ప్రియురాలు

image

ప్రియుడిని కిడ్నాప్ చేసి ఆపై దోపిడి చేసిన ప్రియురాలిని బెంగళూరుపోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరుకు చెందిన శివ,మౌనిక మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమె బెంగళూరులో జాబ్‌చేస్తోంది. శివను బెంగళూరుకు రావాలనికోరింది. అతడు అక్కడికి వెళ్లగా పథకం ప్రకారం ఆమె ఫ్రెండ్స్ శివను కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు.ఓATMలో శివ నగదు డ్రాచేస్తుండగా గస్తీ పోలీసులు వారిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

News November 25, 2024

ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దు: కలెక్టర్

image

ఫీజుల కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. కొన్ని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదని విద్యార్థులను క్లాసులకు, ప్రాక్టికల్స్‌కు అడ్డుకుంటున్నారన్నారు. తరగతి అనంతరం సంబంధిత ధ్రువ పత్రాలు జారీ చేయకపోవడం వంటి అంశాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. విద్యార్థులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

News November 24, 2024

గూడూరు ‘నిమ్మ’ మార్కెట్లో టిక్కీ ఎంతంటే?

image

దేశంలో ప్రధానమైన గూడూరు మార్కెట్లో నిమ్మ ధరలు నిలకడగా సాగుతున్నాయి. ఆదివారం కిలో నిమ్మకాయలు రూ. 25 నుంచి 40 మధ్య ధరతో టిక్కీ రూ.2 వేలు పలికింది. తోటల్లో కాపు పెరగడంతో నిమ్మబస్తాలు అధికంగా వచ్చి చేరుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్తీక మాసం కావడంతో నిమ్మకాయల ధరలు ఆశాజనకంగా ఉన్నాయని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News November 24, 2024

IPL వేలంపాటలో నెల్లూరు కుర్రాడు

image

క్రికెట్ ప్రియుల్ని ఉర్రూతలూగించే IPL బరిలో నెల్లూరు కుర్రాడు నిలవనున్నాడు. ఇవాళ జరిగే IPL వేలం పాటలో నెల్లూరుకు చెందిన అశ్విన్ హెబ్బర్ రూ.30లక్షల ప్రారంభ ధరతో వేలంలో నిలిచాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌‌పై మక్కువతో ఆయన రాణించేవాడని స్థానికులు వెల్లడించారు. ఇవాళ లేదా రేపు అశ్విన్‌ను ఏ టీం తీసుకుంటుందో తేలనుంది. అతడిని ఏ టీం తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయడి.

News November 24, 2024

నెల్లూరు: కన్నీరు పెట్టిస్తున్న వెల్లుల్లి ధరలు 

image

నెల్లూరు జిల్లాలో వెల్లుల్లి ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. రకాన్ని బట్టి కిలో రూ.350 నుంచి రూ.400పైనే ధర పలుకుతోందంటూ ప్రజలు వాపోయారు. ఇతర రాష్ట్రాలలో వెల్లుల్లి దిగుబడులు భారీగా తగ్గిపోవడంతోనే రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు కన్నీరు పెట్టించిన ఉల్లి.. కొంత ఉపశమనం కలిగించినా, వెల్లుల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 24, 2024

ZP సర్వసభ్య సమావేశంలో ‘MLAల ఆగ్రహం’

image

శనివారం జరిగిన నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని శాఖల అధికారులు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ప్రశ్నించారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై మంత్రి ఆనం, కలెక్టర్ ఓ ఆనంద్‌కు వారు ఫిర్యాదు చేశారు.

News November 24, 2024

కందుకూరులో జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్లను సందర్శన

image

నెల్లూరు జిల్లా కందుకూరు DSP ఆఫీస్, కందుకూరు టౌన్, రూరల్, ఉలవపాడు, VV పాలెం పోలీసు స్టేషన్లను శనివారం జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ల మ్యాప్, చార్ట్ ను, స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులు, శిథిలావస్థలో ఉన్న వాహనాలను పరిశీలించి, కోర్టు అనుమతితో వేలం వేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

News November 24, 2024

ప్రతినిధులు జిల్లా అభివృద్ధిలో భాగ స్వాములు కావాలి : ఆనం

image

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాలు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, అ మేరకు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.