India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి డాక్టర్ ఏ. శ్రీనివాసులు తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల జనరల్ విభాగంలో 23,199 మందికి గాను 458 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 431 మందికి గాను 61 మంది గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా అధికారులందరికీ ఆర్‌ఐఓ ధన్యవాదాలు తెలిపారు.
సంగం జడ్పీ హైస్కూల్‌ను శనివారం డీఈవో సందర్శించారు. పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈవో బాలాజీ రావు మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యుత్ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 174 పరీక్షా కేంద్రాలలో 33,434 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు.
నెల్లూరు నగరం పాత వేదయపాలెంకు చెందిన రౌడీ షీటర్ సృజన్ కృష్ణ (చింటూ)ను అత్యంత కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో హత్య చేశారు. ఈ హత్య వెనుక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ తరలించారు. హత్యకు గల కారణాలపై వేదాయపాలెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి సాంకేతిక పరిశోధనతో పాటు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
నెల్లూరు దారుణ హత్య చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. గతంలో రామలింగపురం అండర్ బ్రిడ్జి దగ్గర జరిగిన కత్తి రవి హత్య కేసులో ఉన్న చింటూగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లా ప్రజలకు SP జి.కృష్ణకాంత్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ప్రేమ, ఐక్యత, సంతోషాన్ని తెచ్చిపెట్టాలని ఆయన కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో పండగ నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హద్దు మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలో అటవీ అధికారులు భాగస్వాములై ఆయా భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా కలెక్టర్ ఆనంద్ కోరారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో అటవీ, వన్యప్రాణుల రక్షణపై సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సమావేశ ఉద్దేశాలను జిల్లా అటవీ శాఖాధికారి మహబూబ్ భాషా వివరించారు.
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎనర్జీ సిస్టం, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, డిప్లమా విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కలవని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ జిల్లా మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం తెలిపారు. 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు అర్హులని అన్నారు. మరింత సమాచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
2025 మార్చి ఒకటి నుంచి నెల్లూరు జిల్లాలో 79 కేంద్రాలలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రధాన పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్మీడియట్ బోర్డు నెల్లూరు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. గురువారం నాటి జనరల్ విభాగంలో 27,753 మంది విద్యార్థులకు గాను 792 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, ఒకేషనల్ విభాగంలో 730 మందికి గాను 104 మంది గైర్హాజరయ్యారన్నారు.
వైసీపీ అధినేత జగన్.. CMగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలకన్నా అదనపు సంక్షేమ పథకాలు ఇచ్చారని ఆ పార్టీ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొనియాడారు. 2014-19 వరకు ఐదేళ్ల చంద్రబాబు పాలనను అనుభవించి కూడా మళ్లీ ఆయనకే పట్టం కట్టి ప్రజలు మోసపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు ఇచ్చిన హామీలను ప్రశ్నించాలన్న ఆయన మరోసారి వచ్చే ఎన్నికలల్లో జగన్‌ను CMను చేసుకుందామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. ‘యువత పోరు’లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసినట్లు ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు ప్రభుత్వం రూ.7,100 కోట్ల బకాయిలు ఉండగా కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. పోరాటాలతో ప్రభుత్వం మెడలు వంచుతాం అని కాకాణి హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.