India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ అధినేత జగన్.. CMగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలకన్నా అదనపు సంక్షేమ పథకాలు ఇచ్చారని ఆ పార్టీ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొనియాడారు. 2014-19 వరకు ఐదేళ్ల చంద్రబాబు పాలనను అనుభవించి కూడా మళ్లీ ఆయనకే పట్టం కట్టి ప్రజలు మోసపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు ఇచ్చిన హామీలను ప్రశ్నించాలన్న ఆయన మరోసారి వచ్చే ఎన్నికలల్లో జగన్‌ను CMను చేసుకుందామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. ‘యువత పోరు’లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసినట్లు ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు ప్రభుత్వం రూ.7,100 కోట్ల బకాయిలు ఉండగా కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. పోరాటాలతో ప్రభుత్వం మెడలు వంచుతాం అని కాకాణి హెచ్చరించారు.
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నవిషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 15 గ్రాండ్‌గా మ్యూజికల్ నైట్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్ సత్యయామిని సందడి చేయనున్నారు. ఆవిడతోపాటూ జబర్దస్త్ నటీనటులు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
వికసిత భారత్ యూత్ పార్లమెంట్ 2025లో యువత అంతా పాల్గొనాలని కలెక్టర్ ఓ. ఆనంద్ యువతకు పిలుపునిచ్చారు. బుధవారం అందుకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. 18 నుంచి 25 సంవత్సరాలలోపు యువత అంతా దేశాభివృద్ధికి వేస్తున్న ప్రణాళికలో భాగస్వాములు కావాలని కోరారు. యువత యాప్‌లో రిజిస్టర్ చేసుకుని వారి షార్ట్ వీడియోలను భారత్ యాప్‌లో అప్లోడ్ చేసి దేశాభివృద్ధికి సహకరించాలని సూచించారు.
ప్రతి మూడవ శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో అందర్నీ భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అమరావతి నుంచి పదవ తరగతి పరీక్షలు, స్వచ్ఛ ఆంధ్ర, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్, ప్రజల సంతృప్తి విధానాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
నియోజకవర్గ స్థాయి స్వర్ణాంధ్ర – 2047 ప్రణాళిక తయారు చేయడంలో నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు అత్యంత శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో స్వర్ణాంధ్ర – 2047 యాక్షన్ ప్లాన్‌ను నియోజకవర్గ స్థాయిలో తయారు చేసేందుకు వర్క్ షాప్ నిర్వహించారు. GDDPపై వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లాలో సచివాలయం ఏఎన్ఎంలు (గ్రేడ్-3)గా పనిచేస్తున్న 289 మందికి ఎంపీహెచ్ఏ(ఎఫ్)గా ఇటీవల ఉద్యోగోన్నతి కల్పించారు. వీరికి సబ్ సెంటర్ల కేటాయింపునకు సంబంధించి మార్చి 13న నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. 17న నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర తెలిపారు. సీనియారిటీ సమస్యలు ఉత్పన్నం కాకుండా జోన్ పరిధిలోని జిల్లాల్లో ఒకే రోజు నిర్వహిస్తున్నామన్నారు.
నెల్లూరు జిల్లా ప్రత్యేకాధికారిగా డా.N.యువరాజ్ IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్‌కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు.
CBI అధికారులమంటూ నెల్లూరుకు చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి నుంచి రూ.1.02కోట్లు దోచేసిన ఘటన కలకలం రేపింది. బాధితుడికి గత నెల 25న ట్రాయ్ అధికారులంటూ కొందరు ఫోన్ చేశారు. మీ సిమ్‌పై 85 ఫిర్యాదులు ఉన్నాయని, పలు నేరాలకు సిమ్‌ను వినియోగించారంటూ బెదిరించారు. మరో వ్యక్తి సీబీఐ అధికారినంటూ అతని ఖాతా నుంచి రూ.1,02,47,680ను వివిధ ఖాతాల్లో జమ చేయించారు. దీంతో బాధితుడు వేదాయపాలెం PSలో ఫిర్యాదు చేశాడు.
జిల్లాలో 75344 మంది లబ్ధిదారులకు రూ.1199.85 కోట్లు నిధులు మంజూరు చేశామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. 2019-24 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకను వివిధ దశలలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఒక ప్రటకనలో తెలిపారు.
Sorry, no posts matched your criteria.