Nellore

News November 8, 2024

రాష్ట్రస్థాయిలో అదరగొట్టిన నెల్లూరు కుర్రాడు

image

నర్సరావుపేటలో ఈ నెల 5 నుంచి 7 వ తేదీ వరకు జరిగిన 68వ SGFI స్టేట్ లెవల్ ఇంటర్ స్విమ్మింగ్ పోటీల్లో నెల్లూరు జిల్లా సీతారామపురానికి చెందిన మణికంఠ సత్తా చాటాడు. మణికంఠ రాష్ట్రా స్థాయి స్కూల్ గేమ్స్‌లో 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ అండర్-17 విభాగంలో సిల్వర్ మెడల్,  100, 200 విభాగాల్లో మూడో స్థానంతో మొత్తం 3 పతకాలను సాధించాడు. దీంతో అతడిని పలువురు అభినందించారు. 

News November 8, 2024

లా పరీక్షా కేంద్రాన్ని వైస్ ఛాన్సలర్ ఆకస్మిక తనిఖీ

image

వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో నెల్లూరు నగరంలో ఉన్న వీఆర్ ఐ.ఏ.ఎస్ కళాశాలలో గురువారం జరిగిన ‘లా’ మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా వీఆర్ ఐ.ఎ.ఎస్ కళాశాలలో ఏర్పాటుచేసినా ‘లా’ పరిక్షకేంద్రాన్ని, వసతులను ఆయన పరిశీలించారు.

News November 7, 2024

నెల్లూరులో దారుణం.. రైలుకి ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య

image

రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం నెల్లూరు నగరంలో జరిగింది. నగరంలోని రంగనాయకుల పేటకు చెందిన రవి (50) పరిగెత్తుకుంటూ రైల్వే ట్రాక్ పైకి వచ్చాడు. అతడిని కుటుంబ సభ్యులు, స్నేహితులు వెంబడించారు. అయినా వారి మాట వినకుండా చెన్నై నుంచి విజయవాడ వైపు వేగంగా వెళుతున్న రైలుకి అడ్డంగా వెళ్లి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

News November 7, 2024

9న నెల్లూరులో ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్

image

‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్‌ను ఈనెల 9న సా.4:30కు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెల్లూరులోని S2 థియేటర్‌లో టీజర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ నటించిన ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.

News November 7, 2024

నెల్లూరు: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంలో జరిగిన హత్య కేసులో చేవూరు సుధీర్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.1000 జిల్లా కోర్టు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేసి ముద్దాయిలకు కఠిన శిక్షలు పడేలా చేసిన సిబ్బందిని అభినందించారు.

News November 7, 2024

YCP అధినేత జగన్‌తో కాకాణి భేటీ

image

YCP అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా YCP అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇందులో భాగంగా వారు జిల్లాలోని పార్టీ స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండాలని జగన్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించినట్లు కాకాణి తెలిపారు.

News November 7, 2024

నెల్లూరు: పదో తరగతి ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

పదో తరగతి ఫీజు చెల్లింపునకు గడువును ఈనెల 18 వరకు పొడిగిస్తున్నట్లు నెల్లూరు DEO R.బాలాజీ రావు తెలిపారు. రూ.50 ఫైన్‌తో ఈనెల 25 వరకు, రూ.200 ఫైన్‌తో వచ్చే నెల 03 వరకు, రూ.500 ఫైన్‌తో 10 వరకు చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125, సప్లమెంటరీ విద్యార్థులు మూడు సబ్జెక్టులకు రూ.110, ఆపై సబ్జెక్టు రూ.125 చెల్లించాలన్నారు. 

News November 7, 2024

ఎస్టీల ప్రత్యేక గ్రీవెన్స్ డే పై అధికారులతో ఎమ్మెల్యే సోమిరెడ్డి సమీక్ష

image

ఎస్టీల అభ్యున్నతికి ప్రతి ఒక్క అధికారి తమ వంతు బాధ్యత వహించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో బుధవారం రాత్రి ఆయన ఈనెల 8వ తేదీ వెంకటాచలం మండలం చెముడుగుంటలో నిర్వహించనున్న ఎస్టీల ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీవో అనూష తదితరులు పాల్గొన్నారు.

News November 6, 2024

శరవేగంగా కార్తీక మాస లక్ష దీపోత్సవ ఏర్పాట్లు

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతుల సహకారంతో జరగనున్న కార్తీక మాస లక్ష దీపోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నవంబర్ 8, 9, 10 తేదీల్లో నెల్లూరు నగరంలోని VRC మైదానంలో లక్ష దీపోత్సవాలు నిర్వహించనున్నారు. లక్ష దీపోత్సవం కోసం ఏర్పాట్లు శరవేగంగా నిర్వహిస్తున్నారు.

News November 6, 2024

నెల్లూరు: పదో తరగతి విద్యార్ధి అనుమానాస్పద మృతి

image

నెల్లూరు రూరల్ మండలం ధనలక్ష్మిపురంలోని ఓ ప్రయివేటు స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ముత్తుకూరు RR కాలనీకి చెందిన దువ్వూరు ప్రణీత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ బిడ్డ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.