Nellore

News August 14, 2024

మర్రిపాడు వద్ద అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లిన కారు

image

మండలంలోని నెల్లూరు-ముంబై జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. తరచూ ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం రాత్రి గంగుంట రోడ్డు సమీపంలో అదుపుతప్పిన ఓ కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది.

News August 14, 2024

6 నెలల్లో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు: ఆనం

image

మండల స్థాయి అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులను భాగస్వామ్యం చేసుకొని అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఆత్మకూరు మండలానికి రూ.117 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు మంజూరయ్యాయన్నారు. ఆరు నెలల్లోగా ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి ఏర్పాటు చేస్తామన్నారు.

News August 14, 2024

శ్రీహరికోట: కల నెరవేర్చుకున్న డిప్యూటీ సీఎం పవన్

image

శ్రీహరికోట సందర్శనతో తన చిన్ననాటి కల నెరవేరిందని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ చెప్పారు. షార్‌లో జరిగిన జాతీయ అంతరిక్ష ఉత్సవాల్లో పవన్‌ పాల్గొన్నారు. షార్ డైరెక్టర్ రాజరాజన్ చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగ నమూనాను పవన్‍కు బహూకరించారు. అనంతరం అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పవన్‍ బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు.

News August 14, 2024

₹75 వేల కోట్లతో రిఫైనరీ.. నెల్లూరు జిల్లాలో ల్యాండ్ ఆఫర్!

image

ఏపీలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ ఏర్పాటుకు ఆసక్తిగా ఉంది. రూ.75 వేల కోట్లతో ఏర్పాటు చేయనుండగా ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఆ రిఫైనరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మచిలీపట్నం, రామాయపట్నం (నెల్లూరు), మూలపేటలో స్థలాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి రిఫైనరీ ఏర్పాటు చేసే అవకాశముంది. దీని ద్వారా 10 వేల ఉద్యోగాలు రానున్నాయి.

News August 14, 2024

నెల్లూరు: మూడు రోజుల్లో నిశ్చితార్థం.. యువకుడి స్పాట్ డెడ్

image

తల్లికి మందులు తీసుకునేందుకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన ఆత్మకూరులో జరిగింది. మర్రిపాడు మండలం కదిరినేనిపల్లికి చెందిన సాలెహా(28) జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లి వారం క్రితం స్వగ్రామానికి వచ్చాడు. మూడు రోజుల్లో నిశ్చితార్థం.. ఇంతలో తన తల్లికి ఆరోగ్యం బాగొలేకపోపవడంతో మందులను తీసుకునేందుకు ఆత్మకూరుకు బైక్‌పై వెళ్లాడు. తిరిగి గ్రామానికి వెళ్తుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News August 14, 2024

మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం 15% నిధులు : కలెక్టర్

image

ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం అమలులో మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం 15% నిధులు తప్పనిసరిగా వినియోగించాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. ప్రధానమంత్రి 15 సంవత్సరాల అమలు కార్యక్రమంపై త్రైమాసిక సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శంకరన్ హాల్లో మంగళవారం జరిగింది. ఈ పథకం అమలు చేస్తున్న 25 శాఖలలో అధికారులు లక్ష్యాలను నిర్ధారించుకుని ప్రతి పథకంలో 15% మైనారిటీల అభివృద్ధి, సంక్షేమాన్ని కేటాయించారు.

News August 13, 2024

నెల్లూరు జిల్లాలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేది ఇక్కడే

image

ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో అన్న క్యాంటీన్లను ఈ పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నారు.
*నెల్లూరు : AC మార్కెట్, Fish మార్కెట్, PWD ఆఫీస్, ఇందిరా భవన్,
ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్, జవహార్ బాల భవన్, సెరికల్చర్ ఆఫీస్,
*కందుకూరు : Fish మార్కెట్,
*కావలి : MRO OFFICE PREMISES

News August 13, 2024

విద్యుత్ వెలుగులతో ఆకట్టుకుంటున్న నెల్లూరు కలెక్టరేట్

image

నెల్లూరు నగరం ఆగస్టు 15న జరిగే 78 స్వాతంత్ర్య దినోత్సవాలకు ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా అధికారులు కలెక్టర్ కార్యాలయాన్ని త్రివర్ణ పతాక విద్యుత్ వెలుగులతో సిద్ధం చేశారు. ఈ దృశ్యాన్ని చూడటానికి నగర ప్రజలు తరలి వస్తున్నారు.

News August 13, 2024

అంతరిక్ష వేడుకలను ప్రారంభించిన పవన్

image

శ్రీహరికోటలోని ఎంఆర్ కురుప్ ఆడిటోరియంలో జాతీయ అంతరిక్ష వేడుకలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా హెలికాప్టర్లో షార్‌కు చేరుకున్న ఆయనకు అధికారులు, షార్ శాస్త్రవేత్తలు స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

News August 13, 2024

శ్రీహరి కోటలో పవన్‌కు ఘన స్వాగతం

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరి కోటకు చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా రేణిగుంట నుంచి వచ్చిన ఆయనకు షార్ శాస్త్రవేత్తలు ఘన స్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లో శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సందర్శించనున్నారు. తర్వాత అక్కడ శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.