Nellore

News August 13, 2024

శ్రీహరి కోటలో పవన్‌కు ఘన స్వాగతం

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరి కోటకు చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా రేణిగుంట నుంచి వచ్చిన ఆయనకు షార్ శాస్త్రవేత్తలు ఘన స్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లో శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సందర్శించనున్నారు. తర్వాత అక్కడ శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

News August 13, 2024

రేణిగుంటకు చేరుకున్న పవన్ కళ్యాణ్

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం పవన్ శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రానికి బయల్దేరి వెళ్లారు.

News August 13, 2024

సూళ్లూరుపేటలో పటిష్ఠ చర్యలు

image

శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు శ్రీహరికోటకు చేరుకుంటున్నారు. వారికి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మున్సిపల్ కార్మికులు రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు.

News August 13, 2024

కాసేపట్లో షార్‌కు పవన్ కళ్యాణ్.. అంతా అప్రమత్తం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటించనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రానికి వెళ్తారు. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన వెళ్లడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. షార్‌లోని ఒకటి, రెండు గేట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు ఇప్పటికే కాన్వాయ్ రిహార్సల్ చేపట్టారు.

News August 13, 2024

NLR: రెండుకు చేరిన మృతుల సంఖ్య

image

నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మర్రిపాడు(M) బూదవాడకు చెందిన శనివారపు శ్రీనివాసులురెడ్డి(30), రాజుపాలెం వెంకటేశ్(28), యానాదిరెడ్డి కారులో కృష్ణాపురానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా బూదవాడ సమీపంలోని డాబా వద్ద కారు గుంతలోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. శ్రీనివాసులు రెడ్డి, వెంకటేశ్ చనిపోగా.. యానాది రెడ్డి స్పల్ప గాయాలతో బయటపడ్డాడు.

News August 12, 2024

రేపు శ్రీహరి కోటకు రానున్న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోటకు మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. రేపటి బందోబస్తుకు డిఎస్పీ చెంచుబాను దిశా నిర్దేశం చేశారు. రోడ్డు మార్గంలో వస్తే బందోబస్తుకు అనుసరించాల్సిన చర్యలపై కసరత్తు ప్రారంభించారు. మూడు కీలకమైన ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచనలు చేశారు.

News August 12, 2024

నెల్లూరు: సీఎం చంద్రబాబుతో రూరల్ ఎమ్మెల్యే భేటీ

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వెలగపూడి సచివాలయంలో సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భేటి అయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై ఎమ్మెల్యే మాట్లాడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు సీఎం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

News August 12, 2024

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

నెల్లూరుకు చెందిన విద్యార్థి విష్ణు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన ఆదివారం తమిళనాడులో జరిగింది. విష్ణు చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆయన తమ స్నేహితులతో తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయానికి కారులో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్నకారును తిరువళ్లూరు జిల్లాలో లారీ ఢీకొంది. ఘటనలో విష్ణుతోపాటు మరో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

News August 12, 2024

నెల్లూరు: ఆందోళనకరంగా CBSE విధానం

image

జిల్లాలో సీబీఎస్ఈ విధానం ఆందోళనకు గురి చేస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 పాఠశాలలో ఈ విధానం అమలులో ఉంది. అందుకు తగ్గ సిబ్బందిని నియమించడంలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఉపాధ్యాయులు తెలుగులో చదివి డీఎస్సీ ఉత్తీర్ణత సాధించారు. ఇదే ఇప్పుడు శాపంగా మారింది. డీఈవో పీవీజే రామారావు స్పందిస్తూ.. దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

News August 11, 2024

మంత్రిగా ఆనం బాధ్యతల స్వీకరణ

image

వెలగపూడి సచివాలయంలో మంత్రిగా నేడు ఆనం రామనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 160 దేవాలయాల పున:నిర్మాణ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆనం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.