India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జి.కృష్ణ కాంత్ తెలిపారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 15 మంది పోలీసుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ట్రాన్స్‌ఫర్లు, రిక్వెస్ట్‌లు, మెడికల్ సమస్యలను వారు ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.
మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్ట్‌లు పెడుతున్నారని, నిన్న ముత్తుకూరు మండల టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
కావలి రూరల్ గౌరవరం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ధనియాల విజయ్ కుమార్ మృతి చెందారు. మరో విద్యార్థి బుట్ట విజయకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గౌరవరం నుంచి బైక్‌పై బిట్రగుంటకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ నుంచి జారిపడి విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి కలువాయి ప్రాంతం వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉదయగిరి: దుర్గంపల్లి గ్రామానికి చెందిన గుమ్మళ్ల దశరథ ఈనెల 21 ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించడంలేదని తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆచూకీ కోసం గాలిస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం బద్వేలు ప్రాంతంలో సంచరిస్తున్నారన్న సమాచారం అందిందన్నారు. దీంతో ఆ విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
అయ్యప్పస్వామి భక్తుల కోసం IRCTC తొలిసారిగా భారత్ గౌరవ్ రైలును తీసుకొచ్చిందని నెల్లూరు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు నవంబర్ 16న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా శబరిమల చేరుకుంటుందని అన్నారు. 5 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రకు స్లీపర్ క్లాస్ అయితే రూ.11,475, థర్డ్ ఏసీ రూ.18,790 ఛార్జీగా నిర్ణయించారని, భక్తులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
మనుబోలు జాతీయ రహదారిపై నేడు జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. యాచవరానికి చెందిన కుడుముల మల్లికార్జున బైక్ మీద వెళుతుండగా నెల్లూరు వైపు నుంచి చెన్నై వెళుతున్న ఓ మినీ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఆయనకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మనుబోలు SI కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమశాఖ వారి ఉత్తర్వుల మేరకు జిల్లాలోని SC, ST అభ్యర్థులకు DSC పరీక్ష కొరకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు నెల్లూరు ASWO హాజరత్తయ్య తెలిపారు. అభ్యర్థులు http://jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 25 చివరి తేది అని, ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం కోరారు.
మనుబోలుకు చెందిన కన్నవరం అమరేంద్ర కుమారుడైన భరత్ సూళ్లూరుపేట మండలంలోని చిన్నమాంబట్టు వద్ద చెరువులో ఈతకెళ్లి బుధవారం సాయంకాలం చనిపోయాడు. భరత్ అమ్మమ్మ సంవత్సరికానికి మాంబట్టు వెళ్లాడు. అక్కడ చెరువులో సరదాగా ఈతకొట్టుతుండగా ఈ ప్రమాదం సంభవించి చనిపోయాడు. దీంతో మనుబోలులో విషాదం అలముకుంది. భరత్ మృతదేహం గురువారం మధ్యాహ్నంకి మనుబోలుకి చేరుకోనుంది.
నెల్లూరు జిల్లాలో ఈనెల 25, 26 తేదీలలో ఏపీరాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బి. పద్మావతి పర్యటించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె పిల్లలతో డ్రగ్స్ అక్రమ రవాణాను నిరోధించడం గురించి, జిల్లాలో అమలవుతున్న విధానాలను వారు పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె టూర్ షెడ్యూల్ ప్రకటించారు.
“దానా” తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నెల్లూరు, గూడూరులో ప్రయాణికులకు సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ప్రయాణికులు నెల్లూరు 0861- 2345863, గూడూరు 08624-250795 హెల్ప్ డెస్క్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించింది.
Sorry, no posts matched your criteria.