Nellore

News February 14, 2025

సంగం: లోన్ల కోసం 15వేల దరఖాస్తులు

image

కార్పొరేషన్ లోన్ల కోసం నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 15వేల దరఖాస్తులు వచ్చాయని బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి పేర్కొన్నారు. శుక్రవారం సంగం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగు లక్షల సబ్సిడీతో మండలానికి ఒక జనరిక్ మెడిసిన్ యూనిట్ మంజూరైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాలెట్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

News February 14, 2025

చిన్న క్రాకలో ఎమ్మెల్యే కాకర్ల ఫ్లెక్సీ చించివేత

image

జలదంకి మండలం చిన్న క్రాకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి చించివేశారు. చిన్న క్రాకలో ఓ చెరువు వద్ద ఒక వర్గం ఎమ్మెల్యే ఆయన సోదరుడు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు చించివేయడంతో రాజకీయంగా దుమారం లేపింది. 

News February 14, 2025

పొదలకూరు: రావి ఆకుపై ప్రేమికుల చిత్రం

image

వాలంటైన్స్‌ డే సందర్భంగా  విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పచ్చ పెంచలయ్య ప్రేమికుల చిత్రాన్ని రావి ఆకుపై గీశారు. పొదలకూరు మండలం మహమ్మదాపురానికి పెంచలయ్య ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని వినూత్న చిత్రాలను గీస్తుంటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేమికులందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

News February 14, 2025

నెల్లూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూ రులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు ముందు టీచర్ మందలించడంతో మనస్తాపం చెంది భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆనంతరం ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

News February 14, 2025

నెల్లూరు: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం.. కేసు నమోదు

image

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై నెల్లూరు నగరంలోని చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. కోటమిట్టకు చెందిన సిరాజ్ ఆన్‌లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నితిన్, గోయల్ అనే ఇద్దరు వ్యక్తులు నమ్మబలికి సిరాజ్ వద్ద నుంచి కొంత డబ్బులు తీసుకున్నారు. మోసపోయినట్లు గ్రహించిన సిరాజ్ సైబర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

News February 14, 2025

ప్రాక్టికల్ పరీక్షలకు 122 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నాలుగో రోజు ప్రశాంతంగా ముగిశాయని ఆర్ఐవో డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన 8 కేంద్రాలను, జిల్లా ఒకేషనల్ విద్యాశాఖ అధికారి 8 కేంద్రాలను, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు 7 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 13 కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు. మొత్తం 122 మంది ఈ పరీక్షలకు గైర్హాజరయ్యారని ఆర్ఐఓ వెల్లడించారు.

News February 13, 2025

నెల్లూరు: ప్రణతికి డాక్టరేట్ ప్రదానం

image

రాజకీయలలో మహిళల పాత్ర అనే అంశంపై నెల్లూరు జిల్లాకు చెందిన ఓ.ప్రణతి కి గురువారం డాక్టరేట్ ప్రదానం చేశారు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (CESS)లో ప్రొఫెసర్ బలరాములు పర్యవేక్షణలో పట్టణ మరియు స్థానిక రాజకీయలలో మహిళల పాత్ర అనే అంశంపై ప్రణతి చేసిన పరిశోధనకు డాక్టరేట్ అందించారు. ఈ సందర్భంగా సెస్ డీన్, ఆచార్యులు, ఇతర అధ్యాపక బృందం పరిశోధకురాలికి అభినందనలు తెలిపారు.

News February 13, 2025

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. నెల్లూరు జిల్లాలో చెక్‌పోస్టుల ఏర్పాటు

image

నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకకుండా చర్యలు తీసుకున్నామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ నాయక్ తెలిపారు. మనుబోలు పశు వైద్యశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో ఆరు చోట్ల చెక్‌పోస్ట్‌ల నుంచి ఇతర జిల్లాల నుంచి కోళ్ల రవాణాను అడ్డుకుంటామన్నారు. ఉడికించిన మాంసం, గుడ్లను నిర్భయంగా తినవచ్చు అన్నారు.

News February 13, 2025

నెల్లూరు జిల్లాలో మరో రేప్ అటెంప్ట్!

image

వెంకటాచలం మండలంలోని విద్యార్థినిపై రేప్ అటెంప్ట్ జరిగిన విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్‌లో చదివే విద్యార్థులే ఆ విద్యార్థినిపై లైంగిక దాడి చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 13, 2025

42 మంది నెల్లూరు కార్పొరేటర్లకు నోటీసులు

image

ఇటీవల నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో 42 మంది వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేశారు. అయితే 42 మంది కార్పొరేటర్లు విప్ ధిక్కరించారు. ఈ నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ వారికి నోటీసులు జారీ చేశారు. జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన కరిముల్లాకు కాకుండా కూటమి బలపరిచిన అభ్యర్థికి 40 ఓట్లు వేయగా, ఇద్దరు ఓటింగుకు పాల్గొనలేదు.

error: Content is protected !!