India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉదయగిరి అంగన్వాడీ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీలకు రేషన్ తిప్పలు తప్పడం లేదు. గత కొద్ది నెలలుగా రేషన్ షాపు మిషన్‌లో, అంగన్వాడీ యాప్‌లలో స్టాకు వచ్చినట్లు ఉన్నా తమకు సరుకులు రాలేదంటూ రేషన్ డీలర్లు చెబుతున్నారన్నారు. కొన్నిచోట్ల నూనె, కందిపప్పు ఇవ్వాలంటూ డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని అంగన్వాడీలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యపై దృష్టి సాధించి పరిష్కరించాలని కోరుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. జగన్ నెల్లూరు పర్యటన సమయంలో ఆయనతో పాటు 17 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ప్రసన్నను అరెస్ట్ చేయొద్దని సోమవారం సాయంత్రం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఉలవపాడు(M) వీరేపల్లి STకాలనీకి చెందిన యాకసిరి చెంచయ్య(40) సోమవారం రాత్రి హైవే పై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. వీరేపల్లి జంక్షన్ వద్ద బైక్‌పై ఊర్లోకి వెళుతున్న చెంచయ్యను నెల్లూరు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చెంచయ్యను హుటాహుటిన ఉలవపాడు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 15వ తేదీ చివరి గడువని జిల్లా సైన్స్ అధికారి N. శివారెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ పాఠశాల తరుఫున వారి వినూత్న ఆలోచనలను ప్రాజెక్ట్ రూపంలో ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం రూ.10వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తారన్నారు.

వివాహమై ఏడాది తిరగకుండానే యువతి చనిపోయిన ఘటన ఇది. మృతురాలి తండ్రి వివరాల మేరకు.. నెల్లూరులోని గాంధీసంఘం గిరిజన కాలనీకి చెందిన ప్రశాంతి(25)కి చిట్వేల్(M) నేతివారిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన రాజేశ్‌తో 9 నెలల కిందట పెళ్లి జరిగింది. రాజేశ్ తన స్వగ్రామంలోనే కాపురం పెట్టారు. ఇటీవల వీరి మధ్య కలహాలు వచ్చాయి. దీంతో ప్రశాంతి ఇంట్లోనే ఉరేసుకుంది. ఆమె తండ్రి దాసరి రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. తలమంచి- కొడవలూరు రైల్వే స్టేషన్ మధ్య మూడో లైన్‌లో వెళుతున్న రైలు నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నోవల్ టోపనో జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. మృతదేహాన్ని కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉంచామన్నారు.

ఉదయగిరిలోని గాజుల వీధికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరి కుటుంబంలో దాదాపు 25 మంది ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశారు. ప్రతి సంవత్సరం ఈ కుటుంబంలో ఎవరికో ఒకరికి స్టేట్, జిల్లా, మండల అవార్డు వస్తుంది. గత సంవత్సరం స్టేట్ అవార్డు గాజుల షారుక్, గాజుల మున్న అందుకోగా, ఈ సంవత్సరం షాహిదా అక్తర్ జిల్లా అవార్డు, రంతుజాని మండల అవార్డు అందుకున్నారు.

కందుకూరుకు చెందిన టీచర్ ఈశ్వరమ్మ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును CMచంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అందుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లా PCపల్లిలో టీచర్‌గా పనిచేస్తున్నారు. సాహిత్యాభిలాషి అయిన ఆమె ‘ఈశ్వరీభూషణం’ అనే కలం పేరుతో దాదాపు 2 వేల కవితలు రాసి ప్రశంసలు పొందారు. అవార్డు అందుకున్న ఆమెను పలువురు అభినందిస్తున్నారు.

ఇండియా స్కిల్స్ కాంపిటీషన్–2025 పోస్టర్లను కలెక్టర్ ఆనంద్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. పోటీల్లో పాల్గొనడానికి 16-25 ఏళ్ల యువత అర్హులన్నారు. ఈనెల 30లోపు ఈకేవైసీ ధ్రువీకరణ సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందన్నారు. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్లో ఎస్ఐడీహెచ్ పోర్టల్ లో ప్రత్యేక ఖాతాను ఏర్పాటుచేసుకుని ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

నెల్లూరు జిల్లాలో 2471 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. రాబోయే పది రోజులలో 500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరుతుందని అన్నారు. రైతు సేవా కేంద్రాలలో యూరియా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆధార్ అధికృత విధానం ద్వారా యూరియా పంపిణీ జరుగుతుందన్నారు. యూరియా సరఫరాలో లేదా ధరలలో ఫిర్యాదులు ఉంటే 8331057285 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.