India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కావలి రెండో పట్టణ పోలీసు స్టేషన్లో టీడీపీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి చంద్రశేఖర్ పలువురు టీడీపీ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. దుండి శివు 42 ఖాతా నుంచి X లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై అసభ్య పోస్టులు పెడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ గిరిబాబుకి ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాలతో ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన కోట మండలంలో చోటు చేసుకుంది. కోట(M), జరుగుమల్లి గమళ్లపాళెంకు చెందిన కోటయ్య(46), మస్తానయ్య అన్నదమ్ములు. వీరు పక్కపక్కనే నివాసాలు ఉంటున్నారు. మస్తానయ్య భార్య గుడ్డలు ఉతికే క్రమంలో మురికినీరు అన్న కోటయ్య వాకాలిలోకి వెళ్లడంతో ఇద్దరు భార్యలు గొడవ పడ్డారు. ఈక్రమంలో కోటయ్య మస్తానయ్యపై దాడి చేయగా..తిరిగి మస్తానయ్య దాడి చేయడంతో కోటయ్య మృతి చెందాడు.
నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో చోటు చేసుకున్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఆస్తి సంబంధిత నేరాలలో రికవరీల గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. ప్రజలకు CCTV కెమెరాల ప్రాముఖ్యత వివరించి అవగాహన కల్పించాలన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పలు రకాల భూసమస్యలను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నెల్లూరు, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లతో జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
కందుకూరు పట్టణంలోని తిక్కవరపు రామిరెడ్డి జూనియర్ కళాశాల 29వ వార్షికోత్సవ కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఇదే కళాశాలలో నేను చదువుకున్నందున గర్వ పడుతున్నానని అన్నారు. ప్రభుత్వ కళాశాలలో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా అన్ని వసతులు ఉన్నాయని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.
విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డం వస్తే తొలగించి రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తారు. అయితే వింజమూరు – ఆత్మకూరు వెళ్లే ప్రధాన రోడ్డు మధ్యలోనే విద్యుత్ స్తంభం ఉంచారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. రోడ్డు వేసి ఏం ప్రయోజనం అని విమర్శించారు. అధికారులు స్పందించి వెంటనే స్తంభాన్ని తొలగించి, రోడ్డు పక్కకు మార్చాలని స్థానికులు కోరుతున్నారు.
వచ్చేనెల 3వ తేదీన బుచ్చి నగర పంచాయతీలో 2 నగర వైస్ ఛైర్మన్ల ఎంపిక జరగాల్సి ఉంది. ఈలోగా ఆశావాహులు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 2021 నవంబర్ 15న 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 18 YCP, 2 TDP అభ్యర్థులు విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఛైర్ పర్సన్‌తోపాటు 9మంది TDP లో చేరారు. ఇద్దరు వైస్ ఛైర్మన్లు రాజీనామా చేశారు. దీంతో ఈ పదవుల కోసం పోటీ నెలకొంది.
నెల్లూరు కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తున్న పిల్లలపై నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని వీఆర్సీ, ఆర్టీసీ, గాంధీ బొమ్మ, ఆత్మకూర్ బస్టాండ్ ప్రాంతాలలో 8 మంది పిల్లలతో భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించారు.
న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి N.MD ఫరూక్ గురువారం నెల్లూరు జిల్లాకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి నెల్లూరుకు రోడ్డు మార్గంలో రానున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. అనంతరం ఆయన మైనారిటీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 31న ఆయన తిరిగి నంద్యాలకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు.
కూతురిని రూ. 25 వేలకు అమ్మిన కసాయి తండ్రి రమణయ్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన రమణయ్య దంపతులకు ముగ్గురు మగ పిల్లలు, ఏడుగురు ఆడపిల్లలు సంతానం కలరు. చిత్తూరు జిల్లాలో రమణయ్య కుటుంబం బాతులు మేపుతుండేవారు. భార్య అనారోగ్యం కావడంతో తన ఐదో కూతురు మల్లిక(10)ను నగరికి చెందిన బాలాజీకి రూ.25 వేలకు అమ్మాడు. చిన్నారిని గ్రామస్థులు రక్షించి పోలీసులకు అప్పగించారు.
Sorry, no posts matched your criteria.