Nellore

News July 27, 2024

నెల్లూరు: రేపటి నుంచి ఏపీపీయస్సీ పరీక్షలు

image

నెల్లూరు నగర సమీపంలోని పొట్టేపాలెం వద్ద అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు డిఆర్ఓ లవన్న తెలిపారు. శనివారం నెల్లూరు కలెక్టరేట్లో ఎస్ ఆర్ శంకరన్ హాలులో డిపార్ట్మెంటల్ పరీక్షల కోసం ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ పరీక్షపై సమన్వయ అధికారులతో మాట్లాడారు.

News July 27, 2024

హైదరాబాద్‌లో నెల్లూరు సాప్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్

image

హైదరాబాద్ KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో చేజర్ల మండలం కొలపనాయుడుపల్లెకు చెందిన హేమనందిని అనే సాప్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె శ్రీధర్ అనే మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని 3 నెలల క్రితమే పెళ్లి చేసుకోగా ఆషాడ మాసం నేపథ్యంలో భర్త ఊరికి వెళ్లాడు. ఈ నెల 24న ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 27, 2024

సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌లో సర్పంచ్ మృతి

image

సూళ్లూరుపేట మండలం కుదిరి పంచాయతీ సర్పంచ్, వైసీపీ నాయకుడు బుంగ చంగయ్య అనుమానాస్పదంగా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు.

News July 27, 2024

నెల్లూరు KNR స్కూల్ లో తప్పు ఎవరిది?

image

నెల్లూరు స్కూల్ లో గోడ కూలి మహేంద్ర మృతి చెందిన ఈ ఘటనలో తప్పు ఎవరిది? నాడు-నేడు పనులను నాసిరకంగా చేపట్టడం తోపాటు నిధులు ఇవ్వక అర్ధంతరంగా పనులు ఆపించిన గత ప్రభుత్వ పాలకులదా? సగం పనులు జరిగిన భవనం వద్దకు పిల్లలను వెళ్లకుండా చూడాల్సిన బాధ్యతను విస్మరించిన ఉపాధ్యాయులదా!? ఇలా తప్పు ఎవరిదైనా ఆ తల్లికి మాత్రం పుత్రశోకం మిగిల్చింది. ఈ నిర్లక్ష్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని విద్యా సంఘాలు కోరాయి.

News July 27, 2024

నెల్లూరు: విలవిల్లాడిపోయిన కన్న ప్రేగు

image

నెల్లూరులోని కేఎన్ ఆర్ పాఠశాలలో శుక్రవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందడం అందరినీ శోకసంద్రంలో ముంచెత్తింది. ‘స్కూలుకు వెళ్లొస్తానమ్మా’ అంటూ ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన కుమారుడు సాయంత్రం నిర్జీవంగా కనిపించడంతో కన్న పేగు విలవిల్లాడిపోయింది. నవమాసాలు మోసి కంటికి రెప్పలా పెంచుకున్న కొడుకు ఇక లేడని తెలుసుకున్న ఆ తల్లి గుండె పగిలేలా విలపించింది.

News July 27, 2024

నెల్లూరు: భార్య మృతిని తట్టుకోలేక భర్త సూసైడ్

image

వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామానికి చెందిన వావిళ్ల శ్రీనివాసులు (25) భార్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. భార్య అకాల మరణాన్ని జీర్ణించుకోలేక మనస్థాపానికి గురై ఈనెల 15న పురుగుల మందు తాగి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

News July 27, 2024

విద్యార్థి మృతిపై మంత్రి నారాయ‌ణ తీవ్ర దిగ్భ్రాంతి

image

నెల్లూరులోని KNR ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి మ‌ర‌ణించార‌న్న విష‌యం తెలుసుకున్న మంత్రి నారాయ‌ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. అమరావతిలోని తన ఛాంబర్‌లో ఉన్న మంత్రి నారాయ‌ణ‌కు ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ప్రమాద విషయాన్ని తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణ చేయాలని డీఈవోకు మంత్రి ఆదేశించారు.

News July 26, 2024

BREAKING: పెంచలకోన రోడ్డుపై ప్రమాదం

image

రాపూరు-పెంచలకోన మార్గంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. తెగచర్ల మలుపు వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీకొన్నాయి. ఈఘటనలో మధుసూదన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ పూర్తిగా దగ్ధమైంది. క్షతగాత్రుడిని రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 26, 2024

నెల్లూరు: ప్రేమ జంట విషయంలో వాగ్వాదం

image

ప్రేమజంట విషయమై నడిరోడ్డుపై వాగ్వాదం జరిగింది. నెల్లూరు జిల్లా కలిగిరి పోలీస్ స్టేషన్‌కు ఓ ప్రేమజంట వచ్చింది. ఇరువురు బంధువులు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. స్టేషన్ నుంచి అమ్మాయిని తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య హైడ్రామా నడిచింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు బంధువులను చెదరగొట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం అమ్మాయిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.

News July 26, 2024

విద్యార్థి మృతిపై మంత్రి నారాయ‌ణ తీవ్ర దిగ్భ్రాంతి

image

నెల్లూరులోని KNR ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి మ‌ర‌ణించార‌న్న విష‌యం తెలుసుకున్న మంత్రి నారాయ‌ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. అమరావతిలోని తన ఛాంబర్‌లో ఉన్న మంత్రి నారాయ‌ణ‌కు ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ప్రమాద విషయాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామని భ‌రోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.