India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలికపై యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. వెంకటాచలం మండలంలో ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక టిఫిన్ తెచ్చుకునేందుకు బయల్దేరింది. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు కలెక్టర్ చాంబర్లో గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక సిద్ధంగా ఉందని, ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇసుకను సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బుకింగ్స్ పెరిగే కొద్దీ ఇసుక నిల్వలు పెంచేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కారు బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన సంఘటన వింజమూరు మండలం బొమ్మరాజుచెరువువద్ద గురువారం చోటుచేసుకుంది. కావలి నుంచి కడపకు వెళ్తున్న కారు బొమ్మరాజుచెరువు వద్ద కంకరగుట్ట ఎక్కి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కడపకు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు నుజ్జునజ్జయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరులోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజైన గురువారం అమ్మవారు శ్రీచండీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహిళా VROపై దాడి జరిగింది. సూళ్లూరుపేట(M) కాళంగి నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను ఇలుపూరు దగ్గర వీఆర్వో శ్రీదేవి పట్టుకున్నారు. దానిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మన్నారుపోలూరు వద్ద ట్రాక్టర్ యజమాని వీఆర్వోని అడ్డగించారు. ఆమెను బెదిరించి ఫోన్ పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఆమె వెంటనే ఎమ్మార్వోకు సమాచారం ఇవ్వగా.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతే జాతిపితకు అసలైన నివాళులు అని అన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల సేవలు చిరస్మరణీయం అని అన్నారు.
చేజర్ల తహశీల్దార్‌ను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.3.5 లక్షలు దొచేశారు. సైబర్ నేరగాళ్లు చేజర్ల తహశీల్దార్ వెంకటరమణకు కాల్ చేసి అదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు బెదిరించారు. అనంతరం వారు ఐదు లక్షలు డిమాండ్ చేయగా తహశీల్దార్ మూడున్నర లక్షలు నగదు ఇచ్చారు. అనుమానం వచ్చి సంగం సీఐ వేమారెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన, బోధనేతర సిబ్బందిని పొరుగుసేవల ప్రాతిపదికన ఏడాది కాలానికి భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీసీ ఉషారాణి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా రూ.250 దరఖాస్తు రుసుం చెల్లించి ఈనెల 10వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నా.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి టెట్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పరీక్షల నిర్వహణ కోసం 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు DRO తెలిపారు.
వాటి వివరాలు:
➥ నెల్లూరు నగరం ముత్తుకూరు రోడ్డులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల
➥పొట్టేపాలెం సమీపంలో గల అయాన్ డిజిటల్ జోన్
➥కావలి ఉదయగిరి రోడ్డులో గల విశ్వోదయ కళాశాల
➥కడనూతల RSR ఇంజినీరింగ్ కళాశాల
నెల్లూరు VSUలో ఈనెల 4న AP స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ VC విజయ భాస్కరరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.