Nellore

News October 2, 2024

నెల్లూరు: ‘లైంగిక దాడి విషయం చెప్పొద్దని బాలికను బెదిరించాడు’

image

అల్లూరు మండలోని ఓ గ్రామంలో కన్న కూతురిపై ఓ తండ్రి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఘటనపై బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. మద్యం తాగిన తన భర్త పెద్ద కుమార్తెను ఓ గదిలోకి తీసుకెళ్లి గడి పెట్టి అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించింది. పాప గట్టిగా అరుస్తుంటే ‘ఏం జరుగుతుంది అని నేను అడిగానని.. మందలిస్తున్నా అని నిందితుడు చెప్పాడంది. లైంగిక దాడి విషయం ఎవరికి చెప్పొద్దని బాలికను బెదిరించినట్లు ఆమె వాపోయింది.

News October 2, 2024

శ్రీ చాముండేశ్వరి నవరాత్రుల పోస్టర్ ఆవిష్కరణ

image

ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి నవరాత్రుల మహోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. కాగా మంగళవారం నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శరన్నవరాత్రుల మహోత్సవాల పోస్టర్‌ను మంగళవారం నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News October 1, 2024

నెల్లూరు: కూతురిపై తండ్రి అత్యాచారం

image

కన్న కూతురుపై తండ్రి అత్యాచారం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. సీఐ పాపారావు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళితవాడలో కూలి పనులు చేసుకునే తండ్రికి ముగ్గురు కుమార్తెలు. మద్యానికి బానిసైన తండ్రి సోమవారం రాత్రి ఎవరూ లేని సమయంలో పెద్ద కుమార్తె (12)ను ఇంట్లో బంధించి అత్యాచారం చేశాడు. తల్లి ఫిర్యాదుమేరకు తండ్రిని అరెస్ట్ చేశామన్నారు.

News October 1, 2024

నెల్లూరు: ఈ నెల 3వ తేదీ నుంచి 21 వరకు టెట్ పరీక్షలు: DRO

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని డీఆర్వో లవన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో టెట్ పరీక్షల నిర్వహణపై సమన్వయ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 4 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

News October 1, 2024

నెల్లూరు: నూతన ఎక్సైజ్ పాలసీ గెజిట్ విడుదల

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 182 మద్యం షాపుల లైసెన్స్ జారీకి ఎక్సైజ్ డీసీటీ శ్రీనివాసరావు గెజిట్ విడుదల చేశారు. 2024 నుంచి 2026 వరకు ప్రైవేట్ మద్యం దుకాణాలు నిర్వహించే లైసెన్సుల జారీ కోసం అక్టోబర్ 1 నుంచి 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. 11వ తేదీ కస్తూర్బా కళాక్షేత్రంలో డ్రా తీస్తామన్నారు. అప్లికేషన్ ఫీజు రూ.2 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

News October 1, 2024

నెల్లూరు: ఆరేళ్ల బాలికపై కన్నతండ్రి అఘాయిత్యం

image

నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన గోడ.వెంకటరమణయ్య తన ఆరేళ్ల కూతురుపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక భయపడి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News October 1, 2024

గూడూరు చింతవరం వద్ద కాలేజీ బస్సు బోల్తా

image

చిల్లకూరు మండలం, చింతవరం గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో విద్యార్థులు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న చిల్లకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News October 1, 2024

పాల సేకరణలో గణేశ్వర పురానికి జిల్లాలో ప్రథమ స్థానం

image

వరికుంటపాడు మండలంలోని గణేశ్వర పురం గ్రామానికి పాల సేకరణలో జిల్లాలో ప్రథమ స్థానం లభించింది. నెల్లూరులో జరిగిన పాల సొసైటీ సర్వసభ్య సమావేశంలో గ్రామానికి చెందిన పాల సొసైటీ ప్రెసిడెంట్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ బాదం వెంకట్ నారాయణరెడ్డిను విజయ డైరీ ఛైర్మన్ కొండ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఛైర్మన్ సుధీర్ రెడ్డి అభినందించారు. ఆయన ఈ ఏడాది మొత్తం మీద 1,86,572 లీటర్లు పాలు సేకరించారు.

News October 1, 2024

కావలిలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థిని మృతి

image

కావలి పరిధిలోని హైవేపై మద్దూరుపాడు ఆర్కే దాబా వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కృపాకర్, మైథిలి అనే ఇద్దరు ఒంగోలు నుంచి నెల్లూరుకు స్కూటీపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. నెల్లూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మైథిలి మృతి చెందింది. కృపాకర్‌కి తీవ్రగాయాలయ్యాయి. వీరిది ప్రకాశం(జి) పొన్నలూరు(M) చెరుకూరు గ్రామం. మృతురాలు పదో తరగతి చదువుతోంది. కావలి రూరల్ SI బాజీ బాబు దర్యాప్తు చేపట్టారు.

News October 1, 2024

కోర్టు కేసులపై అధికారులు స్పందించాలి: కలెక్టర్ ఆనంద్

image

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కోర్టు కేసులపై జిల్లా అధికారులు స్పందించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 35 అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.