India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు నెల్లూరులో జరగనున్న హనుమాన్ శోభయాత్ర ఏర్పాట్లు, వెళ్లే మార్గాన్ని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ ఏఆర్ దామోదర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హనుమ భక్త శోభాయాత్ర బందోబస్తు నిర్వహించే సమయంలో విధులు పట్ల పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతేకాకుండా ప్రజలందరూ శాంతియుతంగా శోభాయాత్రలో పాల్గొనాలన్నారు. పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లాలోని ఓ మంత్రి పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.1.96కోట్లు దోచేసిన ఘటన నెల్లూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 7న మంత్రి అల్లుడిని అంటూ మంత్రి సంస్థలో పనిచేసే చార్టెడ్ అకౌంటెంట్‌కు నేరగాళ్లు వాట్సప్ కాల్ చేశారు. అర్జెంటుగా రూ.1.96 కోట్లు అకౌంట్‌కు పంపాలని కోరాడు. దీంతో చార్టెడ్ అకౌంట్ వారి చెప్పిన అకౌంట్‌కు మనీ పంపారు. అనంతరం ఫోన్ ఆఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
ఇంటర్ ఫలితాల్లో కావలికి చెందిన షణ్ముఖ ప్రియ సత్తా చాటింది. ఫస్టియర్ MPCలో ఆమె 464 స్కోర్ సాధించింది. దీంతో ఆమెకు స్టేట్ ర్యాంకు వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆమెను అభినందించారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉదయగిరి MLA కాకర్ల సురేశ్ విమర్శలు గుప్పించారు. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోమరణాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా టీటీడీ భక్తుల మనోభావాలను ఆయన దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లను ఉదయం 6 గంటలకే నిద్ర లేపుతున్నారు. అమరావతి నుంచి శనివారం ఉదయం 6 గంటలకు కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లవారుజామున పట్టణాల్లో పర్యటించాలని ఆదేశించారు. తానూ ఏదో ఒక మున్సిపాల్టీలో ఉదయం 6 గంటలకు పర్యటిస్తానని చెప్పారు.
ఇంటర్ ఫలితాల్లో ఉదయగిరి ప్రాంత విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించారు. ఉదయగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో సీనియర్ ఇంటర్ ఎంపీసీ విద్యార్థిని వేదముఖి 987 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ విద్యార్థిని లతిఫా 963 మార్కులు సాధించగా, జూనియర్ ఇంటర్ విద్యార్థిని అంజుమ్ 464 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ మధు కిరణ్ తెలిపారు.
నెల్లూరు జిల్లాలో అమ్మోనియం గ్యాస్ లీక్ కలకలం రేపింది. తోటపల్లి గూడూరు మండలం అనంతవరంలోని ఓ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో సుమారు పదిమంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్రామంలోనూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు మాస్కులు ధరించారు. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రవేశాల గడువు పొడిగించినట్లు జిల్లా సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటసుబ్బయ్య ఒక ప్రకటనలో తెలిపారు. KGBVలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ తరగతుల ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా ఈనెల 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనాథలు, బడి బయట పిల్లలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలు మాత్రమే అర్హులన్నారు.
ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 22,720మంది పరీక్షలు రాయగా 19,848మంది పాసయ్యారు. 87శాతం పాస్ పర్సంటేజీతో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 26,272 మందికి 19,282మంది పాసయ్యారు. 73శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 7వ స్థానంలో జిల్లా నిలిచింది. మొత్తంగా నెల్లూరు జిల్లాలో 48,992 మంది పరీక్షలు రాయగా.. 39, 130 మంది పాసయ్యారు.
నేడు రెండో శనివారం సెలవు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా యథావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.