Nellore

News April 17, 2026

NLR: పెట్రోల్ బంకుల్లో ఈ సేవల గురించి తెలుసా?

image

ప్రతి పెట్రోల్ బంక్‌లో వినియోగదారులకు చాలా సేవలు అందుతాయనే విషయమే తెలియదు. మరుగుదొడ్లు, తాగునీరు సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలి. అత్యవసరమైతే ఫోన్ కాల్ వినియోగించుకోవచ్చు. బంకులో పెట్రోల్ డీజిల్ నాణ్యత ప్రమాణను పరిశీలించవచ్చు. వాహనాల టైర్లకు గాలి ఉచితంగా పొందవచ్చు. బంకుల్లో ప్రథమ చికిత్స కిట్లు కంపల్సరీగా ఉండాలి. సేవలు కల్పించకపోతే 1800-11-4000కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

నెల్లూరు: హైస్పీడ్ బోట్ల కొనుగోలుకు ఆమోదం

image

సముద్రంలో గస్తీ కోసం 2 హైస్పీడ్ యాంత్రిక బోట్ల కొనుగోలుకు నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు ఆమోదం తెలిపినట్లు జేడీ శాంతకుమారి తెలిపారు. 2బోట్లు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా గస్తీ నిమిత్తం ప్రభుత్వం రూ.120 లక్షలు పూర్తి రాయితీతో అందిస్తుందన్నారు. జిల్లా స్థాయి కమిటీ ఆమోదించిన లబ్ధిదారుల జాబితాను రాష్ట్రకమిటీ ఆమోదానికి పంపినట్లు తెలిపారు. 3నెలల్లో వీటిని అందిస్తామన్నారు.

నెల్లూరులో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు?

image

నెల్లూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి జిల్లాలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. రీసెంట్‌గా కొడవలూరు మండలంలో 2 కేసులు వెలుగు చూశాయి. జిల్లాలో గతేడాది మొత్తం 45 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 4నెలల్లోనే 42 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అధికారులు ప్రజలకు విస్తృతంగా ఈ వ్యాధిపై అవగాహన కల్పించాలి. జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

News April 17, 2026

పెంచలకోన ఆలయానికి రూ.6.50 కోట్లు

image

పెంచలకోన శ్రీఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ఇటీవల రూ.6.50 కోట్లు మంజూరు చేశామని మంత్రి ఆనం రామనారాయణ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల తర్వాత పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విజ్ఞప్తి మేరకు పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంపైనా ఆగమ పండితుల సూచనలతో నిర్ణయం తీసుకుంటామన్నారు. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

News April 17, 2026

నెల్లూరులో రేపటి IAB వాయిదా

image

నెల్లూరు జడ్పీ ఆఫీసులో శనివారం జరగాల్సిన ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డ్(IAB) మీటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటన విడుదల చేశారు. అనివార్య కారణాలతో సమావేశం వాయిదా వేసినట్లు తెలిపారు. తదుపరి సమావేశం తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.

News April 17, 2026

నెల్లూరు జిల్లాలో 90 మందికి ప్రమోషన్

image

నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో పనిచేస్తున్న గ్రేడ్–IV పంచాయతీ అభివృద్ధి అధికారులకు గ్రామ పంచాయతీ జూనియర్ సహాయకులు కం బిల్ కలెక్టర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఈ మేరకు డీపీవో వసుమతి ఓ ప్రకటన విడుదల చేశారు. వివిధ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 89 మంది పంచాయతీ అభివృద్ధి అధికారులతో పాటు ఓ జూనియర్ సహాయకుడికి కలిపి మొత్తం 90 మందికి గ్రేడ్–III పంచాయతీ అభివృద్ధి అధికారులుగా ప్రమోషన్ కల్పించారు.

News April 17, 2026

హాస్టల్ విద్యార్థులకు నెల్లూరు కలెక్టర్ అభినందనలు

image

సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం కలెక్టరేట్‌లో అభినందించారు. 479 మార్కులు సాధించిన కె.గణేష్‌తో పాటు ప్రతిభచూపిన పి.పూజ, బి.పుష్పలత, ఎస్.అనూష, టి.సుమతి, పి.శ్రీవేణుకు ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు ఇలాగే కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

News April 17, 2026

నెల్లూరులో అమ్మాయిల పేరుతో మోసం

image

నెల్లూరు నగరంలోని ఓ యువకుడికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పేరుతో ఉన్న ఫేక్ ఐడి నుంచి మెసేజ్‌తోపాటు, కాల్ చేయగా అవతలి వ్యక్తి ఏడుస్తూ అత్యవసరంగా డబ్బులు కావాలని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలాంటి భావోద్వేగపూరితమైన మాటలతో మాయ చేస్తూ నగదు కాజేసే సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. మీకు తెలిసిన వారు ఎవరైనా SM వేదికగా డబ్బులు అడిగితే పంపకుండా పోలీసులకు ఫిర్యాదు చేయండి.