India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్త్రీ శక్తి పేరిట ఆర్టీసీ బస్సులలో మహిళకు ఉచిత ప్రయాణం పథకాన్ని రేపటి నుంచి ప్రభుత్వం అమలు చేయబోతోంది. నెల్లూరు రీజియన్ పరిధిలో 642 బస్సులు ఉన్నాయి. వాటిలో 510 సొంత బస్సులో కాగా.. రోజుకి సుమారు 1.5 లక్షల మంది ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. రూ.95 లక్షలు రోజువారి రాబడి ఆర్టీసీకి వస్తుంది. మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కనిపిస్తే 80 శాతం మంది మహిళలు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

తన భార్య కాపురానికి రాలేదంటూ వరికుంటపాడు మండలానికి చెందిన కొమరగిరి శ్రీనివాసులు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు తక్షణమే తూర్పు బోయమడుగుల గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు పాల్పడతానన్న శ్రీనివాసులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో గాలించారు. శ్రీనివాసులు చెట్లల్లో దాగి ఉండడాన్ని గమనించిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.

నెల్లూరు అలంకార్ సెంటర్ సమీపంలోని విక్టోరియా గార్డెన్ వద్ద మూలాపేటకు చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సూరి, లక్కీ అనే ఇద్దరు యువకులు ప్రాణ స్నేహితులు. ఇటీవల వీరిద్దరి మధ్య కొంత వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే లక్కీ అనే యువకుడిని సూరి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

జూన్ 30, 2025 కంటే ముందు అనధికారంగా ఏర్పాటైన లేఅవుట్లు, ప్లాట్లను చట్టబద్ధంగా క్రమబద్ధీకరించే సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని మండల తహశీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు, నుడా (NUDA) కార్యాలయాలను సంప్రదించాలన్నారు. http://apdpms.ap.gov.in/ లేదా http://nudaap.org/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

నెల్లూరు జిల్లా కలిగిరి అంబేడ్కర్ నగర్‌కు చెందిన గోసాల మహేశ్ బాబు(బాబి) యువ ఆంధ్రా ప్రో కబడ్డీ సీజన్ – 1 రిఫరీ(న్యాయనిర్ణేత) గా ఎంపికయ్యారు. గోసాల రామచంద్రయ్య, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు బాబి పేదింటి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆగస్టు 15 నుంచి 25 వరకు జరుగు యువ ఆంధ్రా ప్రో కబడ్డీ సీజన్- 1 కి రిఫరీగా ఎంపికైనట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ యలమంచలి శ్రీకాంత్ తెలిపారు.

రాష్ట్రంలో 32 నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన బీజేసీ సీనియర్ నేత RD విల్సన్‌కు కీలక పదవి లభించింది. ఆయనను తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్‌గా నియమించింది. ఆయనకు బీజేపీ నేతలు అభినందనలు తెలిపారు.

రాష్ట్రంలో 32 నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన బీజేసీ సీనియర్ నేత RD విల్సన్‌కు కీలక పదవి లభించింది. ఆయనను తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్‌గా నియమించింది. ఆయనకు బీజేపీ నేతలు అభినందనలు తెలిపారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాకాణి పూజిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు బొకే అందించి రాఖీ కట్టారు. అనంతరం మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు ఆమె జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కందుకూరు మండలం విక్కిరాలపేట గ్రామానికి చెందిన ఎక్కటిల్లి లక్షమ్మ(80) మంగళవారం సింగరాయకొండలో రైలు కిందపడి మృతి చెందింది. రైల్వే స్టేషన్‌లో కృష్ణా ఎక్స్ ప్రెస్ కింద పడి మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న ఆధార్ కార్డును బట్టి రైల్వే పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నెల్లూరు సిటీ, కందుకూరు బాలసదనంలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు ఐసీడీఎస్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. హెల్పర్ కం నైట్ వాచ్‌మెన్-2, హౌస్ కీపర్-1, ఎడ్యుకేటర్-1, యోగా టీచర్-1, మ్యూజిక్ టీచర్-1 పోస్టులను ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం పద్ధతిన భర్తీ చేస్తామని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.