India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు సిటీ, కందుకూరు బాలసదనంలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు ఐసీడీఎస్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. హెల్పర్ కం నైట్ వాచ్‌మెన్-2, హౌస్ కీపర్-1, ఎడ్యుకేటర్-1, యోగా టీచర్-1, మ్యూజిక్ టీచర్-1 పోస్టులను ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం పద్ధతిన భర్తీ చేస్తామని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో ఊరట లభించింది. ముత్తుకూరు మండలం పంటపాలెంలో అక్రమ మద్యం నిల్వ చేసిన కేసులో ఆయనకు బైయిల్ మంజూరైంది. కాకాణి బెయిల్ పిటిషన్ పరిశీలించి నాలుగో అదనపు జిల్లా జడ్జి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఆయనపై మొత్తం 8 కేసులు నమోద కాగా ఇప్పటివరకు ఐదు కేసుల్లో బెయిల్ వచ్చింది. మిగిలిన కేసుల్లో బెయిల్ వస్తేనే జైలు నుంచి రిలీజ్ అవుతారు.

రుస్తుం మైన్స్ కేసులో A-12 బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన్ను విచారించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళవారం నుంచి రెండు రోజులు పాటు ఆయన్ను పోలీసులు విచారించనున్నారు. ఈక్రమంలో శ్రీకాంత్ రెడ్డి ఎవరెవరి పేర్లు చెబుతారనేది ఉత్కంఠ రేపుతోంది.

నెల్లూరు జిల్లాలో జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని అందరూ నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. చిన్నారుల్లో నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను అందరికీ తప్పకుండా అందించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, అంగన్వాడీల్లో విద్యార్థులకు ఈ మాత్రలు ఇస్తామని చెప్పారు.

నెల్లూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)కు మొత్తo 411 అర్జీలు అందాయి. వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి 141, పోలీస్ శాఖవి 62, మున్సిపల్ శాఖవి 40, సర్వేవి 30, పంచాయతీరాజ్‌వి 38 ఉన్నాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కారిస్తామని జేసీ కార్తీక్ తెలిపారు.

దేశ ప్రధాని నరేంద్ర మోదీని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తన సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లారు. దేశాన్ని మోదీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఆ తర్వాత శాలువాతో ప్రధానిని వేమిరెడ్డి సన్మానించారు.

ఈనెల 26వ తేదీన విశాఖపట్నంలో INS ఉదయగిరి పేరుతో స్టెల్త్ ఫ్రిగేట్ ను భారత నౌకాదళం ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీంతో ఉదయగిరికి అరుదైన, అద్భుతమైన అవకాశం దక్కింది. F35 పేరుతో రూపుదిద్దుకుంటున్న భారత యుద్ధ నౌకకు చారిత్రక నేపథ్యం ఉన్న ఉదయగిరి పేరు పెట్టడం విశేషం.149 మీటర్ల పొడవుతో 40 మిస్సైళ్లు ప్రయోగించేలా రూ.600 కోట్లతో ఈ నౌకను తయారు చేశారు.

దగదర్తి మండలం జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున కారు ప్రమాదవశాత్తు బోల్తా పడి ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న హైవే మొబైల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికల సహకారంతో కారులోని మహిళను బయటకు తీశారు. 108 సహాయంతో హాస్పిటల్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నెల్లూరులోని ఓ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళెం గ్రామానికి చెందిన తిరుపతయ్య, వేదవతి దంపతుల కుమార్తె హేమశ్రీకి పదో తరగతిలో 550 మార్కులు వచ్చాయి. నెల్లూరులోని ఓ కళాశాల యాజమాన్యం ఆమెను MPCలో చేర్చుకుంది. అయితే ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని సెక్షన్ మార్చాలని అడిగేది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పి ఉరేసుకుంది.

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్‌ను ఉపయోగించుకోవాలని నెల్లూరు కలెక్టర్ ఆనంద విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులను, వాటి సత్వర పరిష్కారం కోసం కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పౌరుల సమస్యలను సంబంధిత విభాగాలకు పంపి సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 1100 కు ఉచితంగా కాల్ చేయవచ్చని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.